end

జనవరి నాటికి కోవిద్‌ వ్యాక్సిన్‌

కోవిడ్‌19 కట్టడికి వచ్చే(2021) జనవరి నాటికి దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేందుకు వీలున్నట్లు ఎయిమ్స్‌(AIIMS) డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తాజాగా పేర్కొన్నారు. ఈ రెండింటినీ దేశీ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీలే అభివృద్ధి చేస్తుండటం గమనార్హం! వీటిలో ఒకటి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కాగా.. మరొకటి భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌. వీటిని ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) జనవరికల్లా అనుమతించవచ్చని రణదీప్‌ అంచనా వేశారు.

మూడో దశ క్లినికల్‌ పరీక్షలలో ఉన్న వ్యాక్సిన్లకు ఇందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు. కోవిడ్‌-19 నిర్వహణకు సంబంధించిన జాతీయ టాస్క్‌ ఫోర్స్‌లో సభ్యులు కూడా కావడంతో రణదీప్‌ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉన్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అమెరికా.. యూకే కూడా కోవిద్‌ వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తేచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

Exit mobile version