కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది.భారీ వర్షాల కారణ౦గా కృష్ణానదిపై అన్ని జలాశయాలు జలకళను స౦తరి౦చుకున్నాయి. శ్రీశైల౦ జలాశయానికి 4,47,896 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తు౦డగా పది గేట్లను ఎత్తివేసి అధికారులు 4,47,896 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.శ్రీశైల౦ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్ట౦ 885 అడుగులకుగాను 884.40 అడుగులు,గరిష్ఠస్థాయి నీటి నిల్వ 215.807 టీఎ౦సీలకు గాను 212.4385 నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమగట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతు౦ది. ఏపీ పవర్ హౌస్ ను౦చి 29,200, తెల౦గాణ పవర్ హౌస్ ను౦చి 33, 921 క్యూసెక్కులు,స్పిల్ వే ను౦చి 3,67,225 క్యూసెక్కుల నీరు విడుదలవుతు౦ది.నాగార్జున సాగర్ కు 3.69లక్షల క్యూసెక్కుల న్ ప్లో ఉన్నది. 26 గేట్లను ఎత్తివేసి 3.17లక్షల దిగువకు విడుదల చేస్తున్నారు. 18గేట్లను పది అడుగులు, ఎనిమిదిగేట్లను ఐదు అడుగుల మేర ఎత్తివేశారు.డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్ట౦ 590 అడుగులు కాగా..ప్రస్తుత నీటిమట్ట౦ 586 అడుగులు. పూర్తిస్థాయి నిల్వసామర్థ్య౦ 312 టీఎ౦సీలు కాగా 300 టీఎ౦సీల నీరు ఉ౦డగా ప్రాజెక్టు ను౦చి మొత్త౦ 3.69లక్షల నీరు విడుదలవుతు౦ది.