end

హర్షం వ్యక్తం చేసిన ప్రజలు

  • పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేతో సమావేశం
  • సీటి రూపురేఖలు మారిపోయాయి :  మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మెహాన్‌లతో కలిసి సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు సుధీరెడ్డి, భేతి సుభాశ్‌ రెడ్డి, మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, నవీన్ కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సమయాన్ని జీహెచ్ఎంసీ రోడ్లు, నిర్మాణం వంటి పనులకు చక్కగా వినియోగించుకున్నారని, ఈ విషయంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. చాలా మంది లాక్ డౌన్ అనంతరం బయటకు వచ్చి తమ కాలనీల్లో మారిన రోడ్లను చూసి హర్షం వ్యక్తం చేశారని ఎమ్మెల్యేలు తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారీగా చేపట్టాల్సిన పనులపైన ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. స్థూలంగా జీహెచ్ఎంసీ ద్వారా పనులు వేగంగా నడుస్తున్నాయన్నారు.

కాలేశ్వరం త్రివేణి సంగమం గోదావరి ఉదృతి

ముఖ్యంగా ఎల్బీనగర్ చౌరస్తా వంటి చోట్ల మెత్తం రూపురేఖలు మారిపోయాయన్నారు. ఎస్సార్డీపీ పనుల ద్వారా అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి ఒక పెద్ద మహా ప్రస్థానం ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే అనుమతులు వచ్చిన చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులు మరింత వేగంగా జరిగేలా చూడాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సానిటేషన్ పనులు భాగానే కోనసాగుతున్నాయని, జల మండలి పరిధిలోకి వచ్చిన సీవరేజి నిర్వహణపైన కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల పరిధిలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంపైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు కోరారు.

కార్పొరేటర్‌ వాహనానికి నిప్పు

ఈ సంవత్సరాంతానికి సూమారు 75వేల ఇండ్లు పంపీణీకి సిద్ధంగా ఉంటాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫుట్‌పాత్‌, పబ్లిక్ టాయిలేట్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వారికి తెలిపారు. లింక్ రోడ్లు, పార్కుల అభివృద్ధి కార్యక్రమాలు జీహెచ్ఎంసీకి మంచి పేరు తెచ్చాయని ఎమ్మెల్యేలు మంత్రికి తెలిపారు. సమావేశంలో ఆయ నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన పనుల తాలూకు  విజ్ఞప్తిలను అందజేశారు. అన్నింటికీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి వారికి హమీ ఇచ్చారు.

Exit mobile version