end
=
Saturday, April 12, 2025
సినీమా`లేడీస్ టైల‌ర్‌` కథ‌ను మ‌లుపు తిప్పే సన్నివేశం
- Advertisment -

`లేడీస్ టైల‌ర్‌` కథ‌ను మ‌లుపు తిప్పే సన్నివేశం

- Advertisment -
- Advertisment -

సుందరం తన పనేదో తను చూసుకుంటూ ఎంచక్కా ఆ పల్లెటూర్లో అమ్మాయిలందరికీ జాకెట్లు కుడుతూ ఎప్పటికైనా టౌనుకు వెళ్ళి సెటిల్ అవ్వాలని సొంతంగా షాప్ పెట్టుకోవాలని కలలు కంటూ కాలం గడిపేస్తూ ఉంటాడు…

ఊరి చివర పాకలో పొద్దు పోక కాళ్ళు ఆరేసుకుని కునుకు తీస్తుండగా అటువైపుగా వచ్చిన కోయదొర
సుందరాన్ని చూసి నువ్వు తొక్కేది చక్రం చూపు వక్రం అని నొటికొచ్చిన నాలుగు మాటలేవో అంటాడు…
అంతటితో ఆగకుండా తన దగ్గరున్న ఆల్బమ్ చూపించి..`దాసరి నారాయణరావు (Dasari Naryana Rao) – పక్కన్నేను.. నటశేఖర కృష్ణ(Krishna) – పక్కన్నేను.. నూతన్ ప్రసాద్ (Nutan prasad)- పక్కన్నేను.. జయప్ర‌ద‌ (Jayaprada)- పక్కన్నేను` అంటాడు, అతని మాటలు, అతని చూపించిన ఫొటో ఆల్బమ్ చూసి ఆ కోయదొర చెప్పిన మాటలు నమ్ముతాడు సుందరం. కోయదొర సుందరం చేయి చూసి కుడి తొడ మీద కుంకుడుకాయంత మచ్చ ఉన్న అమ్మాయిని చేసుకుంటే రాజయోగం పడుతుందని, పట్టుకుంటే బంగారం అవుతుందని, ముట్టుకుంటే మణులు మాణిక్యాలవుతాయని చెబుతాడు..

కుడిభుజం మీద బల్లి పడితే కలిసోస్తుందని బల్లి శాస్త్రం లో చదివి, సరిగ్గా కుడిభుజం మీద బలవంతంగా బల్లని పడేలా చేసుకునే సుందరానికి ఇలాంటి విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా గురూజీ, మామూలుగానే సుందరానికి మూఢనమ్మకాల పిచ్చి ఎక్కువ ఇక చూస్కోండి… మచ్చున్న భామ కనులకు కనరావా అంటూ సుందరం, సుందరంతో పాటు బట్టల సత్యం – సీతారాముడు కలిసి చేసిన అల్లరి దశాబ్దాలు గడిచినా మన కళ్ళముందు కదలాడుతూనే ఉంది!

– విశ్వ టాకీస్‌
90309 38479

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -