- ట్వీట్ చేసిన ఆయన కుమారుడు తేజస్వీ
- అక్క రోహిణితో సహా ఇద్దరు క్షేమంగా ఉన్నారని వెల్లడి
రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) కిడ్నీ(Kidney) మార్పిడి అపరేషన్ పూర్తైంది. సర్జరీ విజయవంతంగా ముగిసినట్లు ఆయన కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సోమవారం ట్వీట్(Tweet) చేశారు. పాప(నాన్న) కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్(Operation Success) కావడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి మార్చారు. అక్క రోహిణి ఆచార్యతో సహా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రార్థనలకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. తండ్రిని బెడ్‌పై షిష్ట్ చేస్తున్న వీడియోను షేర్(Video Share) చేశారు. లాలూ సింగపూర్‌లో నివాసం ఉండే తన కూతురు కిడ్నీ దానం చేసింది. ఈ సర్జరీ సింగపూర్(Singapore)లోనే జరిగింది. లాలూ సహచరుడు భోళా యాదవ్, తేజస్వీ రాజకీయ సలహాదారుడు సంజయ్ యాదవ్, బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ(Bihar CM), పెద్ద కూతురు మిసా భారతి కూడా సింగపూర్‌లోనే ఉన్నారు.