end

తెలంగాణలో భూముల విలువ పెంపు

  • నేటి నుండి కొత్త ధరలు

తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి అంటే నేడు(మంగళవారం) నుండి భూముల విలువలు పెరగనున్నాయి. అయితే ఈ కొత్త ధరలకు అనుగుణంగా భూమి రిజిస్ర్టేషన్‌ ఛార్జీలు కూడా పెరుగుతాయి. రివిజన్‌ ఆఫ్‌ మార్కెట్‌ వ్యాల్యూస్‌ గైడ్‌లైన్స్‌ అండ్‌ రూల్స్‌ 1998 ప్రకారం భూముల విలువలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది. అదేవిధంగా పెరిగిన భూముల ధరలను అనుసరించి సెక్షన్‌ 5 ప్రకారం రిజిస్ర్టేషన్‌, స్టాంపుల శాఖ కమిషనర్‌కు అందుకు తగిన రుసుము పెంచాలని సూచించింది.

అదేవిధంగా వ్యవసాయం, వ్యవసాయేతర భూములు, ఫ్లాట్‌లు, ప్లాట్‌ల విలువలను వేర్వేరుగా సవరించినట్లు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భూముల రేట్లు అధికంగా ఉండడంతో నామమాత్రంగానే పెంచినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి….

Exit mobile version