నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న విగ్రహం
‘ల్యాప్‌టాప్’ (Holding Laptop) పట్టుకున్న మహిళకు (Women)సంబంధించిన పురాతన గ్రీకు విగ్రహం (Greek Statue).. టైమ్ ట్రావెల్ థియరీకి (Time travel theory)సంబంధించిన ఆసక్తికర చర్చను లేవనెత్తింది. యూఎస్‌బీ పోర్ట్స్ (USB ports)తో ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తున్న ఒక మహిళను ప్రతిబింబిస్తున్న ఈ పురాతన విగ్రహాన్ని చూస్తుంటే.. టైమ్ ట్రావెల్ ఉండేదా? అనే అంశంపై నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
కాలిఫోర్నియా, మాలిబులోని జె. పాల్ గెట్టి మ్యూజియం (J. of Malibu, California. Paul Getty Museum)లో ‘గ్రేవ్ నైస్కోస్ ఆఫ్ యాన్ థ్రోన్డ్ ఉమన్ విత్ యాన్ అటెండెంట్’ (‘Grave Nisco’s of an Enthroned Woman with an Attendant’) అని పిలువబడే ఈ విగ్రహం.. 100 BCలో అంత్యక్రియలకు గుర్తుగా ఉపయోగించబడింది. 37 అంగుళాల పైగా ఎత్తుగల ఈ విగ్రహంలో ఒక యువ సేవకుడు సన్నని పెట్టెను తెరిచి సింహాసనం లాంటి కుర్చీపై (Chair)కూర్చున్న మహిళకు చూపించడాన్ని గమనించవచ్చు. ఒక యూట్యూబ్ (Youtube) చానెల్‌లోని వీడియో ప్రకారం.. ఇది జ్యువెలరీ బాక్స్ (Jewelry box) అయ్యుండేందుకు దాని బేస్ చాలా తక్కువగా ఉందనే భావన ఉంది. అంతేకాదు ఇది మోడర్న్ ల్యాప్‌టాప్ లేదా ఏదో హ్యాండ్‌హెల్డ్ డివైజ్ (A handheld device)కు సంబంధించిన పోలికను కలిగిన ఒక ఆశ్చర్యకరమైన వస్తువును వర్ణిస్తోంది. ఇక సదరు మహిళ కళ్లు కూడా ల్యాప్‌టాప్ మానిటర్‌ను చూసిన విధంగా అదే ప్రదేశంలో కేంద్రీకరించబడటం చూడొచ్చు.
ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియా (Social media)లో ఆసక్తిని పెంచింది. చాలా మంది అది పిజ్జా బాక్స్ (Pizza box)అయ్యుంటుందని భావించగా, మరికొంతమంది కాస్మెటిక్ బాక్స్(Cosmetic box)గా వర్ణించారు. అయితే, ఫోర్బ్స్‌కు చెందిన బయో ఆర్కియాలజిస్ట్ క్రిస్టినా కిల్‌గ్రోవ్ (Bioarchaeologist Christina Kilgrove of Forbes).. ల్యాప్‌టాప్ కలిగిన చిత్రంపై క్లారిటీ ఇచ్చాడు. రాసుకునేందుకు ఉపయోగపడే రెండు మైనపు వస్తువులు కావచ్చని పేర్కొన్నారు. ఇక యూఎస్‌బీ పోర్టుగా భావిస్తున్న రంధ్రాల గురించి వివరిస్తూ.. ఒకప్పుడు ‘చెక్క లేదా ఇతర పాడైపోయే వస్తువులు’ కలిగి ఉండవచ్చని వెల్లడించాడు.
(Cricket:సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త నిబంధనలు)