end
=
Wednesday, April 16, 2025
నోటిఫికేషన్లున్యాయ‌శాస్త్ర‌ విద్యార్థులారా.. అలెర్ట్ !
- Advertisment -

న్యాయ‌శాస్త్ర‌ విద్యార్థులారా.. అలెర్ట్ !

- Advertisment -
- Advertisment -

టీజీ లాసెట్(TG Law cet) , పీజీ లా సెట్(Law pg cet) ద‌ర‌ఖాస్తుల గ‌డువు(Application)ను ఈ నెల 30 వ‌ర‌కు పొడించిన‌ట్లు ప‌రీక్ష‌ల క‌న్వీన‌ర్ విజ‌య‌ల‌క్ష్మి ప్ర‌క‌టించారు. నిర్దేశిత గ‌డువులోపు విద్యార్థులు(Law students) ఎలాంటి అప‌రాధ రుసుము(Penalty) లేకుండానే ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త ఉత్త‌ర్వుల ప్ర‌కారం మంగ‌ళ‌వారంతో గడువు ముగియాల్సి ఉన్న‌ది. కానీ.. విద్యార్థుల విన‌తుల మేర‌కు ప్ర‌భుత్వం గ‌డువు పెంచింది. సోమ‌వారం వ‌ర‌కు మూడేండ్ల లాసెట్‌కు 21,483, ఐదేండ్ల లాసెట్‌కు 6,326, పీజీ లాసెట్‌కు 2,556 ద‌ర‌ఖాస్తులు అందిన‌ట్లు క‌న్వ‌నీర్ తెలిపారు. లా సెట్ అభ్య‌ర్థులు జూన్ 6వ తేదీన ప్ర‌వేశ ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. పీజీ సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష తేదీ ఖ‌రారు కావాల్సి ఉన్న‌ది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -