end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంలెజండరీ సింగర్‌ లతామంగేష్కర్‌ కన్నుమూత
- Advertisment -

లెజండరీ సింగర్‌ లతామంగేష్కర్‌ కన్నుమూత

- Advertisment -
- Advertisment -

గానకోకిల, ఇండియన్‌ లెజండరీ సింగర్‌ లతామంగేష్కర్‌ (92) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ముంబై బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రి డాక్టర్లు నిర్ధారించారు. గత నెలలో లతాజీకి కోవిడ్‌ సోకి వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్నారు. కొన్నాళ్లపాటు రికవరీ అయిన తర్వాత మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఆమెను వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాల తెలిపాయి. కానీ లతాజీ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ ఆదివారం ఉదయం కన్నుమూశారు.

లతా మంగేష్కర్‌ 1942లో ఆమె గాయనీగా కెరీర్‌ ప్రారంభించారు. దాదాపు ఆమె 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడారు. హిందీ చిత్రసీమకు ఎన్నో తన గాత్రం ద్వారా సేవలందించారు. లతాజీ లేరనే వార్తతో సినీ ప్రపంచం, శ్రోతలు, అభిమానులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఆమె పాడిన ప్రతీ పాట జనం గుండెల్లో చెరగని ముద్ర వేశాయి.

నైటింగల్‌ ఆఫ్‌ ఇండియా పేరు దక్కించుకున్న లతాజీకి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆమెకు భారత ప్రభుత్వం ‘భారతరత్న’ అవార్డులో సత్కరించింది. ఇదేగాకుండా ఆమెకు పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌, దాదాసాహెబ్‌ఫాల్కేతోపాటు అనేక అవార్డులు వరించాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -