end
=
Friday, September 20, 2024
వార్తలురాష్ట్రీయంఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటాం: మంత్రి
- Advertisment -

ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటాం: మంత్రి

- Advertisment -
- Advertisment -

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎదురైన ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని ఐటీ, మున్సిపల్‌ శాఖా మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఫలితాల‌ అనంతరం మంత్రి.. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కుంగిపోము అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలకు, గెలుపు కోసం శ్రమించిన మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు చెప్పారు. దుబ్బాక ఫలితం మేం ఆశించిన విధంగా రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆరున్నరేళ్లలో టీఆర్ఎస్ ఎన్నో విజయాలు నమోదు చేసుకుందని గుర్తుచేశారు. దుబ్బాక తీర్పును లోతుగా సమీక్షించుకుంటామని కేటీఆర్ వెల్లడించారు.

కాగా, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కమలం-కారు మధ్య హోరాహోరీగా.. నువ్వానేనా అన్నట్టుగా సాగిన ఫలితాల్లో బీజేపీ విక్టరీ సాధించింది. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలువగా.. కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -