end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంజీహెచ్‌ఎంసీపై ఓ సారి లుక్కేద్దామా..?
- Advertisment -

జీహెచ్‌ఎంసీపై ఓ సారి లుక్కేద్దామా..?

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన తర్వాత తొలిసారి 2009లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 150 డివిజన్లకు గానూ.. కాంగ్రెస్‌ 52, టీడీపీ 45, ఎంఐఎం 43, బీజేపీ 4, ఇతరులు 5 స్థానాలను గెలుచుకున్నాయి. అప్పుడు కాంగ్రెస్‌.. మజ్లిస్‌ పార్టీలు చెరో సగభాగం పదవీ కాలాన్ని పంచుకున్నాయి. కాంగ్రెస్‌ నుంచి బండ కార్తీక రెడ్డి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2016లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకంగా 99 స్థానాలు గెలుచుకొని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మేయర్‌గా బొంతు రామ్మోహన్‌ బాధ్యతలు స్వీకరించగా, బాబా ఫసియొద్దిన్‌ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎంఐఎం 44 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఆ పార్టీ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

ఇక కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఘోరంగా తయారైంది. ఓ మాటలో చెప్పాలంటే దయనీయంగా తాయారైందని చెప్పొచ్చు. క్రితం సారి 52 డివిజన్లను గెలుచుకున్న ఆ పార్టీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ గతంలో లాగే 4 స్థానాలే గెలిచింది. ఇక టీడీపీ ఏకంగా 44 స్థానాలు కోల్పోయి ఒక్క స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పరిస్థితి సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవగా.. బీజేపీ బలంగా పుంజుకుందని చెప్పవచ్చు. టీఆర్‌ఎస్‌ ఆ స్థాయిలో సీట్లు సాధించకపోయినా.. మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయం. ఆ పార్టీకి ఎక్స్‌ అఫిషియో ఓట్లు కీలకం కానున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -