పాక్ చెరలో చిక్కుకున్న ఓ భారతీయుడు 20 ఏళ్ల తర్వాత తన పుట్టిన గడ్డపై అడుగుమోపాడు. ఆ సందర్భంలో అతడి ముఖంలో విరిసిన కాంతిని వర్ణించలేము. వివరాలు చూస్తే.. ఒడిషాలోని సుందర్‌ఘర్ జిల్లా, జంగతేలికి చెందిన బ్రిజుకుల్లు అనే వ్యక్తి1995లో పొరపాటుగా పాకిస్థాన్ సరిహద్దులోకి అడుగుపెట్టాడు. అది గమనించిన పాక్‌సైన్యం అతడిని అదుపులోకి తీసుకుంది. అతడిని కోర్టు ముందు హాజరుపర్చింది. పాక్ కోర్టు అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో అతడిని లాహోర్‌లోని కేంద్ర కారాగారంలో ఉంచారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత పాక్.. అతడిని చెర నుంచి విముక్తి చేసింది. దీంతో, పట్టలేని ఆనందంతో తన స్వంత ఊరికి చేరుకున్నాడు బ్రిజు. అతడికి గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. డప్పులు వాయించి, పూలమాలలతో అలంకరించి ఊరేగించారు.