end

LIC:LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) .. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత చదువులు చదువలేకపోతున్న పేద విద్యార్థులకు గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ -(Golden Jubilee Scholarship Scheme) 2022 పేరుతో ఉపకారవేతనాన్ని అందిస్తోంది.


రెగ్యులర్ స్కాలర్(Regular Scholar) 2021 – 22 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
కుటుంబ వార్షిక ఆదాయం(Annual Family Income) రూ. 2,50,000 మించరాదు.
ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థల్లో ఏదైనా డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్, డిప్లొమా, వృత్తి విద్య కోర్సులు అభ్యసిస్తున్న వారు అర్హులు.

స్పెషల్ గర్ల చైల్డ్(Special Girl Child):
పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి ఇది ఉద్దేశించింది.

అర్హత:
2021-22 విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో పదో తరగతి(10th Class) ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థి తల్లి దండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2,50,000 మించరాదు.
ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్, డిప్లొమా, ఐటిఐ(ITI) అభ్యసిస్తున్న బాలికలు అర్హులు.

స్కాలర్‌షిప్:
రెగ్యులర్ స్కాలర్ పథకానికి ఏడాదికి రూ. 20,000 ఉంటుంది.
స్పెషల్ గర్ల్ చైల్డ్ పథకానికి రూ. 10,000 అందిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా చేయాలి.
చివరితేది: డిసెంబర్ 18, 2022
వెబ్‌సైట్: https://licindia.in

(Indian Judiciary & Indian Polity:భారత న్యాయవ్యవస్థ & ఇండియన్ పాలిటీ)

Exit mobile version