తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ నేపథ్యంలో మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. సాధారణ రోజుల కంటే పండుగ ముందు రోజుల్లో వైన్ షాపుల యజమానులు భారీ మొత్తంలో మద్యాన్ని దిగుమతి చేసుకున్నారు. దీంతో నాలుగు రోజుల్లోనే ప్రభుత్వ ఖజానాకు రూ.812.24 కోట్లు సమకూరాయి. ఈ నెలలో 27వ తేదీ వరకే రూ.2,218.65 కోట్ల రాబడి వచ్చింది. 31 వరకు ఈ రాబడి రూ.2,500 కోట్లు దాటవచ్చని ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా వ్యాధి భయాందోళనలున్నా.. మద్యం విక్రయాలు మాత్రం ఆశాజనకంగా సాగాయి. అక్టోబర్ 25న దసరా పండుగ జరుపుకోగా… 22 నుంచే మద్యం దిగుమతులు షురూ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు, వెయ్యికిపైగా బార్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు ఉన్నాయి.
ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్: ప్రధాని
మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బుల యజమానులు సాధారణ రోజుల్లో బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి రోజుకు రూ.80-90 కోట్ల విలువైన లిక్కర్, బీరును కొనుగోలు చేస్తారు. కానీ.. ఈ నెల 22న ఏకంగా రూ.305.96 కోట్ల విలువైన మద్యం, బీరును లిఫ్ట్ చేశారు. సాధారణంగా ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.2,200-2,300 కోట్ల వరకు రాబడి వస్తోంది. కానీ ఈ నెల 27 వరకే రూ.2,200 వేల కోట్ల మార్కును దాటింది. దసరా పండుగతో ఎక్సైజ్ రాబడి ఆశాజనకంగా మారడం వల్ల కరోనా కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట కలిగింది.
తెలంగాణలో ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ దసరా, నవరాత్రి ఉత్సవాలు. ఈ సందర్భంలోనే కుటుంబం, చుట్టాలు, స్నేహితులంతా ఒక్కచోట చేరి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి ఇలాంటి భారీ పండుగ వస్తే ఇంకెలా ఉంటుంది మరి. స్నేహితులంతా ఒక్కచోట చేరి హంగామా చేసుకోరూ’.