end
=
Thursday, July 4, 2024
వార్తలురాష్ట్రీయంకార్పొరేటర్‌పై స్థానికుల దాడి
- Advertisment -

కార్పొరేటర్‌పై స్థానికుల దాడి

- Advertisment -
- Advertisment -
  • నాలాలు, చెరువులు కబ్జా చేసిన రియల్‌ వ్యాపారులు
  • కాలనీల్లో నిలిచిపోయిన వర్షపు నీరు
  • అధికారులను, నాయకులను నిలదీస్తున్న ప్రజలు

గత ఐదు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది. నగరంలోని చాలా ప్రాంతాలలో కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల అవసరాలు అందరికీ అందడం లేదని హాయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని రంగనాయకులగుట్టలో కార్పొరేటర్‌ తిరుమలరెడ్డిపై స్థానికులు మండిపడ్డారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.

విద్యుత్‌షాక్‌తో కుటుంబ సభ్యులు దుర్మరణం

స్థానికంగా నలాలను కబ్జా చేసి ప్లాట్లు ఏర్పాటు చేసిన రియల్‌ వ్యాపారులపై చర్యలు తీసుకొని ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారులు కానీ, కార్పొరేటర్‌గానీ పట్టించుకున్న పాపానపోలేదని, దాని ఫలితంగా వరద నీరు కాలనీలో నిలిచిపోయిందని కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చి సమీపంలోని నాలా కబ్జాకు గురైందని కార్పొరేటర్‌పై స్థానికులు దాడి చేశారు. అయితే ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు చేపడుతున్నారని కార్పొరేటర్‌ చెప్పినప్పటికీ స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చెప్పనలవిగా మారాయి.

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

చిన్న పిల్లలు, వృద్ధులు వైద్యం, తిండి లేక చనిపోయే పరిస్థితులు కనబడుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా హైదరాబాద్‌నగరం, నగర శివారుల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కుమ్మక్కై చెరువులు, నాలాలు కబ్జా చేయడం వల్లనే వరద నీరు కాలనీల్లో ఎక్కడికక్కడ నిలిచిపోతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. నాయకులు చేసిన పాపానికి ప్రజలు బలి అవుతున్నారని వాపోతున్నారు.

మాజీ హోంమంత్రి ‘నాయిని’ ఆరోగ్యం విషమం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -