- ఈ నెల 20న జరగాల్సిన కెబినెట్ మీటింగ్ రద్దు
- కరోనా కట్టడి పర్యవేక్షణలో మంత్రులు బిజీ
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు తెలిసింది. ఆయా జిల్లా మంత్రులతో ఫోన్‌లో సమీక్షించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం లాక్‌డౌన్‌ను మే 30 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి జీవో విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ఈ నెల 20న జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్‌ను రద్దు చేశారు. మంత్రులు, వైద్య సిబ్బందితో కలిసి జిల్లాలో కరోనా కట్టడి పర్యవేక్షణలో ఉన్నందున క్యాబినెట్ మీటింగ్ జరగడం కష్టమని సీఎం తెలిపారు.
ఇవి కూడా చదవండి…