end

లాక్‌డౌన్‌ మరింత కఠినం

  • సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టుదిట్టం కోసం తెలంగాణలో లాక్‌డన్‌ అమలవుతోందని తెలిసిందే. అయితే పోలీసులు ఎన్ని చెక్‌పోస్టులు పెట్టినా ఏదోవిధంగా చాలా మంది ప్రజలు వివిధ కారణాలతో రోడ్ల మీదకు వస్తున్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన డీజీ మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఈ నెల 30 వరకు చాలా కఠినంగా లాక్‌డౌన్‌ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అనుమతి ఉన్నవారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు రోడ్ల మీదకు వస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇక… ఎవరికి వారే కరోనా నిర్ధారణ పరీక్ష

లాక్‌డౌన్‌ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వాటిల్లుతున్నప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కఠినంగా చర్యలు అమలు చేయాల్సి వస్తుందని సీఎం పేర్కొన్నారు. ప్రజలు దీనికి సహకరించాలని, అనుమతి ఉన్న సమయంలోనే అంటే ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే తమ పనులు చేసుకోవాలని మిగతా సమయంలో అంటే 20 గంటలపాటు ఇండ్లలోనే ఉండాలని కోరారు.

సినీ నిర్మాత బీఎ రాజు కన్నుమూత

గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు లాక్‌డౌన్‌ను స్వచ్ఛందంగా అమలుచేస్తున్నారని.. నగరాలు, పట్టణ్లాల్లో మాత్రం మరింత సమర్ధంగా అమలుకావాల్సి ఉన్నదని చెప్పారు. దీనిపై అందరూ దృష్టిపెట్టాలని కోరారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం నియమ నిబంధనల ప్రకారం లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేయాల్సిన బాధ్యత డీజీపీ, ఎస్పీలు, కలెక్టర్లు అందరిపై ఉన్నదని చెప్పారు.

అక్షరాల 2 కోట్ల వేతనం…!

Exit mobile version