ధూమపానం(Smoking), దీర్ఘకాలిక వ్యాధులు త్వరగా వృద్ధాప్యాన్ని ప్రేరేపిస్తాయన్న విషయం తెలిసిందే. కానీ సంతోషంగా లేకపోవడం, ఒంటరితనం (Loneliness), నిరాశ కూడా వయస్సు (age)ను వేగవంతం చేస్తుందని తాజా అధ్యయనం (Research)నిర్ధారించింది. మానసిక ఆరోగ్యం జీవసంబంధమైన వృద్ధాప్యంపై మేజర్ ఇంపాక్ట్ (Major impact)చూపుతుందని స్పష్టం చేసింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ‘వృద్ధాప్య గడియారం (Aging Clock)’ క్రియేట్ చేసింది. ‘శరీరం (body) మరియు ఆత్మ అనుసంధానించబడి ఉన్నాయి అనేది మా ప్రధాన సందేశం’ అని పేర్కొంది.
(Hug: ఒక్క కౌగిలింతతో అన్నీ దూరం)
డీప్ లాంగేవిటీ ఇనిస్టిట్యూషన్ (Deep Longevity Institution) (దీర్ఘాయువును మార్చడంపై దృష్టి సారించిన బయోటెక్నాలజీ సంస్థ) నాయకత్వంలో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ (Stanford University), హాంకాంగ్‌లోని చైనీస్ విశ్వవిద్యాలయంతో కలిసి నిర్వహించిన అధ్యయనం.. 11,914 మంది చైనీయుల (chinese) నుంచి సేకరించిన డేటా ఆధారంగా ‘వృద్ధాప్య గడియారం’ సృష్టించారు. 16 బ్లడ్ (blood) బయోమార్కర్స్‌ను పరిశీలించిన అధ్యయనం.. వీటిని పార్టిసిపెంట్స్ యొక్క ‘క్రోనోలాజికల్ ఏజ్’ (Chronological Age)తో పోల్చారు. ఈ ఫలితాల్లో వారి నిజమైన వయస్సు కంటే కనీసం 5.7 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్నట్లు తెలిసింది. అంటే ఒక వ్యక్తి పుట్టినరోజు ప్రకారం 20ఏళ్ల వయసు ఉన్నా అతని ఆలోచనలు మాత్రం 14-15ఏళ్ల వయసుకు సంబంధించినవి వ్యక్తికి సమానంగా ఉంటాయని అర్థం.
బయోమార్కర్ (Biomarker) అనేది రక్తం లేదా ఇతర ద్రవం మరియు శరీరంలోని కణజాలాలలో కనిపించే ఒక అణువు. ఇది ఒక నిర్దిష్ట ప్రక్రియతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ అధ్యయనం కోసం ఎంచుకున్న బయోమార్కర్‌లో కొలెస్ట్రాల్ (Cholesterol), గ్లూకోజ్ లెవల్స్ ఉన్నాయి. అదనంగా రక్తపోటు, బాడీ మాస్ ఇండెక్స్, ఊపిరితిత్తుల పనితీరుకు సంబంధించిన కొలతలు, జీవసంబంధమైన లింగం వంటి 7 బయోమెట్రిక్ (Biometric)లను కూడా పరిగణలోకి తీసుకున్నారు పరిశోధకులు.
‘సంతోషంగా లేకపోవడం లేదా ఒంటరిగా (Alone) ఉండటం వంటి మానసిక (mental health) కారకాలు ఒకరి జీవసంబంధమైన వయస్సుకు 1.65 సంవత్సరాల వరకు జోడించబడతాయని నిరూపించాం’ అని పరిశోధకులు పేర్కొన్నారు. ఒంటరితనం మాత్రమే కాదు.. నిరాశ, నిస్సహాయత, నిద్ర లేమి, అసంతృప్తి, భయం వంటి ఇతర మానసిక అనారోగ్యాలు వేగంగా వృద్ధాప్యాన్ని ప్రేరేపిస్తాయి. అధ్యయనం యొక్క మరొక ఆసక్తికరమైన అన్వేషణ ఏమిటంటే.. వివాహం (marriage) చేసుకోవడం వల్ల జీవసంబంధమైన వయస్సును 7 నెలలు తగ్గించవచ్చు. అయితే ధూమపానం చేసేవారు ధూమపానం చేయని వారి కంటే 15 నెలలు పెద్దవారని అంచనా వేయబడింది. అదనంగా గ్రామీణ (village) ప్రాంతాల్లోని ప్రజలు (city)పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి కంటే కనీసం 5 నెలలు పెద్దవారని నిర్ధారించింది.
(One Night Stand:‘వన్ నైట్ స్టాండ్’ తప్పా? ఒప్పా?)