end

చైనాలో లాంగ్యా వైరస్ కలకలం..

కరోన తగ్గుముఖం పడుతున్న సమయం లో మరో కొత్త వైరస్. చైనాలో కొత్త వైరస్ కలకలం రేపుతున్నది. ఇప్పటి వరకు ఈ దేశంలో 35 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌తో ఇప్పటి వరకు మరణాలు చోటుచేసుకున్నప్పటికీ.. 40 నుంచి 75 శాతం మరణాలు రేటు సంభవించే తీవ్రత ఈ వైరస్‌కు ఉన్నదని రీసెర్చర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే లాంగ్యా వైరస్ తీవ్రత, లక్షణాలు ఎలా ఇంటాయో తెలుసుకుందాం. చైనాలో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతున్నదే వార్త చాలా మందిని హడలెత్తించింది. ఎందుకంటే.. ప్రపంచం ఇంకా కరోనా వైరస్‌ను మరిచిపోలేదు. దాని బాధితులు ఇంకా ఉన్నారు. ఇప్పటికీ ఈ మహమ్మారి ప్రాణాలు తీస్తూనే ఉన్నది. అధికారికంగా ఈ వైరస్ తొలిసారి చైనాలోనే నమోదైంది. తాజాగా, లాంగ్యా హెనిపావైరస్ వైరస్ కూడా చైనాలోనే వెలుగు చూడటంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే లాంగ్యా వైరస్ మనుషులకు ఎక్కడి నుంచి సోకింది? దాని తీవ్రత ఎంత? లక్షణాలేమిటీ?

ఈ వైరస్ సోకిన వారిలో చాలా సాధారణ లక్షణాలే కనిపిస్తున్నాయి. నీరసం, దగ్గు, ఆకలి లేకపోవడం, నొప్పులు వంటి లక్షణాలు ప్రధానంగా ఈ వైరస్ సోకినవారిలో కనిపిస్తున్నాయి. కొందరిలో రక్త కణాల్లోనూ అసాధారణ సంకేతాలు కనిపించాయి. అలాగే, లివర్, కిడ్నీ దెబ్బతిన్నట్టుగా కూడా పలు కేసుల్లో డిటెక్ట్ చేశారు. ఈ వైరస్ తీవ్రతపైనా ఇంకా చర్చ జరుగుతున్నది. ప్రస్తుతానికైతే ఇది చాలా ప్రమాదకరమైనదనే ఆలోచనలు లేవు. కానీ, శాస్త్రజ్ఞులు మాత్రం హెచ్చరిస్తున్నారు. జంతువులు, మనుషుల్లో ఈ వైరస్ తీవ్ర పరిణామాలు సృష్టించవచ్చని చెబుతున్నారు. 40 నుంచి 75 శాతం మేరకు మరణాల రేటు ఉండొచ్చని చెప్పడం గమనార్హం. చైనాలో ఈ వ్యాధితో ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా చోటుచేసుకోకపోవడం తో అక్కడి ప్రజలు ఊపిరిపిల్చుకున్నారు. అలాగే, ఈ వైరస్‌కు ఇప్పటి వరకు టీకా లేదు. ఎలుక జాతికి చెందిన 200 జీవుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు.

Exit mobile version