end

Ganapathi: గణపతికి గరికపూజ ఎందుకు చేస్తారు?

lord ganapathi garika pooja

Lord Ganapathi: గడ్డిపోచ(Garika)ను సంస్కృతంలో దూర్వారము అంటారు. దూర్వాయుగ్మంతో పూజలందుకోవడం గణపతికి(Vinakayaka Chavithi Pooj) ఇష్టం. ఈ సృష్టిలో గడ్డిపోచ కూడా విలువైనదే అని నిరూపించడానికా అన్నట్లు స్వామి ఈ గరికపూజను అందుకుంటాడు. మనం పనికిరావనుకునే మొక్కల చిగుళ్లు, వేళ్లు, పళ్లనే పూజకోసం స్వామి స్వీకరిస్తాడు. దూర్వాయుగ్మ పూజకు సంబంధించి పౌరాణిక గాథ ఒకటివుంది. అనలాసురుడు(Analasurudu) అనే రాక్షసుడు లోకాలన్నింటినీ భయపెట్టేవాడు. దేవతలందరూ గణపతికి మొరపెట్టుకున్నారు. ఆయన అమాంతంగా అనలాసురుణ్ణి మింగేశాడు. ఆనలము అంటే అగ్ని. అనలాసురుణ్ణి మింగగానే వినాయకునికి విపరీతమైన తాపం వచ్చింది. దేవతలందరూ ఆయనకు ఉపశమనం కలిగించడం కోసం శైత్యోపచారాలు చేశారు.

(గణేశ్ మహారాజ్ కీ జై)

పద్మాలు(Lotus) కప్పారు. పుష్పాలు వేశారు. చంద్రుణ్ణి తీసుకొచ్చి ముఖంమీద ఉంచారు. ఏం చేసినా ఆయన తాపం చల్లారలేదు. చివరకు పరమశివుడు(Lord Shiva) గరికపోచ తీసుకుని వెంటిలా చుట్ట్టి గణపతి శిరస్సుపై ఉంచాడు. అది ఫలితాన్నిచ్చింది. అలా గణపతికి గరికపోచ అనేది సాక్షత్తూ శివుడే అనుగ్రహించాడు. హస్తా నక్షత్రానికి(Hastha Nakshtram) అధిదైవం వినాయకుడు. హస్తా నక్షత్రం కన్యారాశికి చెందింది. దానికి అధిపతి బుధుడు. ఆయనకు ఇష్టమైన రాయి పచ్చ… అంటే మరకతం. మరకతం అసలైనదో కాదో పరీక్షించాలంటే గరికను దాని దగ్గరగా పెడతారు. పచ్చకు గడ్డిని ఆకర్షించే గుణముంటుంది.

Exit mobile version