end

ఆర్టీసికి రోజుకు రూ.12 కోట్ల నష్టం

  • లాక్‌డౌన్‌ వల్ల ప్రయాణీకులు కరువు
  • మళ్లీ పీకల్లోతు అప్పుల్లోకి తెలంగాణ ఆర్టీసి

కరోనావైరస్‌ ప్రభావం వల్ల ప్రస్తుతం తెలంగాణలో పది రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం అందిరికి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ వల్ల సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులతోపాటు ప్రైవేటు వాహనదారులు, చివరికి ప్రభుత్వ ప్రయాణ సంస్థ అయిన ఆర్టీసి కూడా కోట్లలో నష్టపోతుంది. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్టీసి ఆదాయానికి గండి పడింది. లాక్‌డౌన్‌ సడలింపు కేవలం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకే ఉండడం వల్ల ప్రజలు తమ ప్రయాణాలు వాయిదాలు వేసుకున్నారు. చాలా వరకు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు రద్దు చేసుకున్నారు. దీంతో ఇటు ఆర్టీసితోపాటు అటు ప్రైవేటు బస్సులు కూడా నడవలేని పరిస్థితి నెలకొంది.

అక్షరాల 2 కోట్ల వేతనం…!

తెలంగాణ ఆర్టీసికి రోజుకు దాదాపు 12 నుండి 13 కోట్ల నష్టం వస్తున్నట్లు ఆర్టీసి ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ మధ్యనే ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక మద్దతుతో సంస్థ నష్టాల నుండి బయటపడుతుండగా ఈ కరోనా లాక్‌డౌన్‌తో చాలా నష్టం వాటిల్లుతున్నట్లు తెలిసింది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కష్టంగా మారినట్లు ఒక సీనియర్‌ అధికారి తెలిపారు. అదీగాకుండా కార్గో పార్సెల్‌ సర్వీసు కూడా ఆర్డర్లు లేక వెల వెలబోతున్నాయి. కస్టమర్లు లేక కొరియర్లు, పార్సిల్స్‌ లేవు. ఇటు కార్గో సర్వీసు కూడా దాదాపు 15 లక్షల ఆదాయాన్ని కోల్పోయినట్లు వివరించారు.

తెలంగాణ లాక్‌డౌన్‌ – మినహాయింపులు

చివరికి జెబీఎస్‌, ఎంజీబిఎస్‌ బస్టాండ్‌లలో ధాన్యం రవాణా చేయడం వల్ల కేవలం లక్ష ఆదాయం వస్తుందని వివరించారు. అన్ని జిల్లా కేంద్రాలలో ధాన్యం రవాణాకు కార్గో బస్సులు అందుబాటులో ఉంచినా రైతులేవరు ముందుకు రావడం లేదని వాపోయారు. ఇక లాక్‌డౌన్‌ మే 22న ముగుస్తుండడంతో ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తుందా? లేక లాక్‌డౌన్‌ ఎత్తివేస్తుందా అనే దానిపై ఆర్టీసి ఆదాయం ఆదారపడి ఉందని, లాక్‌డౌన్‌ కొనసాగిస్తే ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేమని తెలిపారు.

మన ప్రాణాలు మన చేతుల్లోనే…!

Exit mobile version