- ప్రేమ విషయాన్ని దాచిపెట్టిన వధువు
- పెళ్లైన రెండు గంటలకే పెటాకులు
- ప్రియుడు వంశీపై ఎస్సీ, ఎస్టీ, న్యూసెన్స్ కేసు నమోదు
- వధువు దివ్య స్వధార్ హోంకు తరలింపు
అవును, వాళ్లిద్దరు ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. కానీ వధువు తన కుటుంబం కోసమో, లేక మరేయితర కారణమో తెలియదు కానీ తల్లిదండ్రులు కుదర్చిన పెళ్లి చేసుకోవడానికి సిద్దపడింది. అందరి సమక్షంలో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక అప్పగింతలే తరువాయి. అయితే అంతలోనే ప్రియుడు ప్రత్యక్షమై వరుడు ముందే వధువును ముద్దు పెట్టుకున్నాడు. అంతే అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. పెళ్లి కాస్త పెటాకులైంది. ఈ స్టోరీ అంతా పోలీసుల ముందు విచారణకు వెళ్లింది. ఇదంతా సినీమా స్టోరీలాగా అనిపిస్తున్నా … అక్షరాల ఇది వాస్తవం. ఈ వింతైన సంఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో జరిగింది.
షాపూర్‌లో సినీ ఆర్టిస్టులతో వ్యభిచారం
ఈ లవ్‌స్టోరీ ఏంటంటే…. హుజురాబాద్‌కు చెందిన దివ్య, వంశీ అనే యువకుడిని ప్రేమించింది. అయితే ఆమె భయపడిందో, లేక కుటుంబం గౌరవం కోసమో, లేదా బలవంతానో పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరించింది. దీంతో మంచిర్యాల జిల్లా మందమర్రికి ఎందిన ప్రవీణ్‌కుమార్‌తో పెళ్లి సంబంధం కుదుర్చుకొని మొన్న సోమవారం అంగరంగవైభవంగా పెళ్లి జరిపించారు. అంతా బాగానే జరిగింది. ఇక అప్పగింతల అనంతరం ఊరేగింపు(బరాత్) సమయంలో వధువు దివ్య లవర్ ఫుల్‌గా తాగి తన లవ్‌ను మరిచిపోలేక వరుడు, వధువు ఉన్న కారును అడ్డగించాడు. దీంతో ఆగకుండా వధువును కారులోనుంచి దింపి గట్టిగా ముద్దు పెట్టాడు. అక్కడే ఉన్న వరుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. పెళ్లివారంతా అవాక్కయ్యారు. దీంతో వరుడు ప్రవీణ్‌కుమార్, ప్రియుడు వంశీ ఇద్దరు బాగానే కొట్టుకున్నారు.
నాకు ప్రియుడే కావాలి : వధువు దివ్య
ఈ విచిత్ర పరిస్థితుల్లో ఈ విషయం కాస్త పోలీసుల వరకు వెళ్లింది. వరుడు ప్రవీణ్, వరుడు తల్లిదండ్రులు, వరుని బంధువులు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. దీంతో పోలీసులు దివ్య ప్రియుడు వంశీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, న్యూసెన్స్ కేసు కూడా ఫైల్ చేశారు. ఇదిలావుంటే ప్రియుడు పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సంగతి తెలుసుకున్న వధువు దివ్య అక్కడకు వచ్చేసింది. తనకు ప్రియుడు వంశీ కావాలంటూ తేల్చి చెప్పింది. దీంతో అక్కడ ఉన్నవారంత బిత్తరపోయారు. తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థంగాక దివ్యను పోలీస్‌స్టేషన్‌లోనే వదిలేసి వెళ్లిపోయారు. వరుడు వంశీ, వరుడు తరపున బంధువులు కూడా వధువును వదిలేసి మందమర్రికి వెళ్లిపోయారు. పోలీస్‌స్టేషన్‌లో ఒంటరిగా ఉన్న దివ్యను కరీంనగర్‌లోని స్వధార్ మహిళా కేర్ హోంకు పంపించారు.
మారటోరియంపై వడ్డీలు విధించడం సరికాదుః సుప్రీంకోర్టు
ఈ విచిత్రమైన సంఘటనతో దివ్య తల్లిదండ్రులు, అటు వరుడు వంశీకి, అతని తల్లిదండ్రులకు అవమానభారమే మిగిలింది .