తెలంగాణ రాష్ర్టంలో కరోనా వైరస్ బారిన పడి చాలా మంది మరణిస్తున్నారు. పోలీసు శాఖలో కూడా వందలాది మంది పోలీసులు ఉద్యోగులు కోవిడ్ 19 బారిన పడి మృతి చెందారు. అయితే తాజాగా హైదరాబాద్ మాదాపూర్ ఎస్‌ఐ అబ్బాస్ కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందడం పోలీసు శాఖను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. అయితే కొంతకాలంగా ఎస్‌ఐ అబ్బాస్ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రగతిభవన్ ముందు నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం
ఈ మధ్యనే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. దురదృష్టావశాత్తు ఆయన శుక్రవారం చికిత్సపొందుతూ మరణించారు. ఆయన మృతి పట్ల తెలంగాణ పోలీసు శాఖ విచారం వ్యక్తం చేస్తోంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ఏదేమైనా కరోనాను ఎదుర్కోవడంలో, నివారించడంలో ప్రజల ముందుండి పోరాడుతున్న పోలీసులు, డాక్టర్లకు పెనుముప్పు తప్పడం లేదు.