end

మహాత్మాగాంధీ కళ్లజోడు వేలం

  • రూ.2.5 కోట్లకు సొంతం చేసుకున్న వ్యక్తి

మహోన్నతమైన వ్యక్తి, భారత జాతిపిత మహాత్మాగాంధీకి ధరించిన కళ్లజోడును బ్రిటన్‌లో వేలం వేశారు. బంగారం పూత పూసిన గాంధీజీ ధరించిన కళ్లజోడుకు రూ.2.5 కోట్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. బ్రిటన్‌లోని ఈస్ట్‌ బ్రిస్టల్‌ సంస్థ వీటిని వేలంపాట వేసింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

అయితే 1920లో గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో వీటిని ధరించారని అయితే తనకు సహాయపడిన వ్యక్తికి గాంధీజీ బహుమతిగా ఇచ్చారని తెలిసింది. అయితే ఆ వ్యక్తి వారసుడు ఆ కళ్లజోడును వేలం వేయాలని నిర్ణయించుకొని బ్రిటన్‌లోని ఈస్ట్‌ బ్రిస్టల్‌ సంస్థకు పంపించాడట. అదేగాకుండా ఆ కళ్లజోడు బాగాలేదనిపిస్తే, ఎవరు కొనలేకపోతే పడేయాలని సూచించాడట. అయితే ఆ సంస్థ వేలం పాటపెడితే 15 లక్షల వరకు రావొచ్చని అంచనా వేసింది. ఆ ఆంచనాలకు మించి ఏకంగా 2.5 కోట్ల రూపాయలకు మరో వ్యక్తి సొంతం చేసుకున్నాడు.

నెల రోజుల ముందే బస్‌ టికెట్‌ బుకింగ్‌

ఏదేమైనా భారతదేశానికి స్వాంత్రత్యం తీసుకొచ్చిన మన జాతిపిత గాంధీజీ ధరించిన కళ్లజోడు అంత ధర పలకడం మనకూ గర్వకారణమే. అలాగే ఆ మహాత్ముడు స్వయంగా ధరించిన కళ్లజోడును సొంతం చేసుకోవడం ఆ వ్యక్తికి అదృష్టమే కదా.

Exit mobile version