సూపర్‌స్టార్ మహేష్‌బాబు(Super star Mahesh), దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి (Star director SS Rajamouli)`ఎస్ఎస్ఎంబీ 29` ప్రాజెక్ట్ చిత్రం శరవేగంగా షూటింగ్(Shooting) జరుపుకొంటున్నది. దేశ, విదేశాల్లో చిత్రం షూటింగ్ జరుగుతున్నది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలోనూ భారీ సెట్టింగ్‌లు(Heavy settings) రెడీ అవుతున్నాయి. ఇదంతా ఇప్పటికప్పుడు పూర్తయ్యే పని కాదని రాజమౌళి గురించి తెలిసిన ప్రతిఒక్కరికీ తెలుసు. దీంతో మహేష్ ఫ్యాన్స్ మరో రెండు మూడేళ్లు సినిమా కోసం నిరీక్షణ తప్పేలా లేదని బ్లైండ్ గా ఫిక్సయ్యారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ గత సినిమా `గుంటూరు కారం` చిత్రాన్ని మొదట్లో ఫ్యాన్స్ అంతగా ఆదరించ లేదు కానీ.. క్రమక్రమంగా ఫ్యాన్స్ ఆ చిత్రాన్ని కల్ట్ మూవీగా చూస్తున్నారు. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. కానీ.. మహేష్ సినిమా ను మళ్లీ తెరపై చూడడం ఇప్పట్లో సాధ్యపడదనేది వాస్తవం. ఇలాంటి సందర్భంలో మహేష్ పాత చిత్రాలు మళ్లీ తెరమీదకు తెస్తున్నారు ఫిలిం మేకర్స్. అలా ఇప్పటికే `పోకిరి` సినిమా రీ రిలీజ్ చిత్రాల్లో సంచలనం సృష్టించింది. రికార్డు వసూళ్లు సాధించి బాక్సాఫీసును షేక్ చేసింది. ఇప్పడు తాజాగా రెండు సినిమాలు విడుదలవుతున్నాయి.
బుధవారం మోస్ట్ సెన్సిబుల్ డెరెక్టర్ గుణశేఖర్ విజవల్ ట్రీట్ `ఒక్కడు` చిత్రం విడుదలైంది. ఈ నెల 26న కోరటాల శివ దర్శకత్వంలో వచ్చిన `భరత్ అనే నేను` చిత్రం కూడా విడుదల కానున్నది. ఈ రెండు సినిమాలు ఇప్పుడు వెండితెరపై సందడి చేయనున్నాయి.