end
=
Thursday, November 28, 2024
వార్తలుజాతీయంPM MODI:జీ20లో ప్రతి పౌరుడిని భాగం చేయండి
- Advertisment -

PM MODI:జీ20లో ప్రతి పౌరుడిని భాగం చేయండి

- Advertisment -
- Advertisment -

  • పార్టీ నేతలకు పిలుపునిచ్చిన ప్రధాని మోడీ


జీ20 అధ్యక్ష పదవి (G20 presidency)ని స్వీకరించడంలో ప్రతి భారతీయుడిని భాగం చేయాలని ప్రధాని మోడీ (Prime Minister Modi) పిలుపునిచ్చారు. సోమవారం బీజేపీ ప్రధాన కార్యాలయం (BJP headquarters)లో పార్టీ నాయకులతో ఆయన మాట్లాడారు. 2024 సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సన్నద్ధత, వ్యుహాలపై రెండు రోజులపాటు నిర్వహించనున్న సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. భారతదేశం వంటి దేశానికి జీ20 అధ్యక్ష పదవి అంటే ఏమిటో ప్రధాని నరేంద్ర మోదీ హైలైట్ చేశారు. ఈ సందర్భాన్ని వైభవంగా నిర్వహించడంపై దృష్టి సారించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

అలాగే ప్రతి భారతీయుడు (Indian) ఈ విజయాన్ని చూసి గర్వపడేలా చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజల భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలని చెప్పారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. భారత్ అధికారికంగా ఇండోనేషియా (Indonesia) నుంచి జీ20 బాధ్యతలను డిసెంబర్ 1న స్వీకరించింది. అంతకుముందు ప్రధాని పార్టీ కార్యాలయం (Prime Minister’s Party Office) లోకి ప్రవేశిస్తుండగా బీజేపీ (BJP)శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. ప్రధాని మోడీ ప్రయత్నాల వల్లె ఏడాది మొత్తం జీ20 అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు దక్కిందని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా (Nadda) ప్రశంసించారు.ఇక 2022 ప్రతిష్టాత్మక జీ 20 అధ్యక్ష బాధ్యతలను గురువారం భారత్ లాంఛనంగా స్వీకరించింది. ఈ బాధ్యతలను భారత్ సంవత్సరం పాటు నిర్వర్తించనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మనిషి కేంద్రంగా గ్లోబలైజేషన్ (Globalization) దిశగా ఆలోచనల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు. అలాగే మన ఆలోచనా ధోరణిలోనే మార్పు రావాలని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయీకరణ (Internationalization) అనేది మనిషి కేంద్రంగా జరగాలని, ఆ దిశగా ఆలోచనల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ పత్రికల్లో ఆర్టికల్
జీ 20(G20) అధ్యక్షతకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పత్రికల్లో ప్రధాని మోదీ రాసిన వ్యాసం ప్రచురితమైంది. అందులోఆయన మరోసారి భారతీయ భావన అయిన ‘వసుధైక కుటుంబం’ (Vasudhaika kutumbam’) ను మరోసారి ప్రస్తావించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమన్న భావన భారతీయులదన్నారు. ‘ఒకే ప్రపంచం, కుటుంబం, ఒకే భవిత’ (‘One World, One Family, One Destiny’) అనేదే తమ సిద్ధాంతమన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పు, కరోనా వంటి మహమ్మారులు.. తదితర సమస్యలను ఒంటరిగా కన్నా ఐక్యంగా ఎదుర్కోవడం అభిలషణీయమన్నారు. సంకుచిత భావనలను ప్రపంచ దేశాలు విడనాడాలన్నారు.

(Lalu Prasad Yadav:లాలూకు కిడ్నీ మార్పిడి విజయవంతం)

జీ 20(G20) సభ్య దేశాలను మాత్రమే కాకుండా ఇతర ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా (Asia, Africa, Latin America) దేశాలను కూడా సంప్రదించిన తరువాతనే జీ 20(G20) ప్రాధాన్యతలను నిర్ణయిస్తామని మోదీ వెల్లడించారు. ప్రపంచ వేదికలపై పెద్దగా స్వరం వినిపించని దేశాలకు ఈ సంవత్సరం జీ 20 గొంతుకగా నిలుస్తుందన్నారు. టీకాలు, ఔషధాలు, ఆహారం, ఎరువులు (Vaccines, Medicines, Food, Fertilizers) వంటి నిత్యావసరాలు అన్ని దేశాలకు అందాల్సి ఉందన్నారు. అందరూ బావుండాలంటే, అన్ని దేశాలు వృద్ధి చెందాలంటే, భారత్ విశ్వసించే పంచ భూతాలైన గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం (The five demons are air, earth, water, fire and sky)లను సమిష్టిగా, సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -