end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌వంటలుSweet Corn: స్వీట్ కార్న్ వడలు చేసుకోండీ ఇలా
- Advertisment -

Sweet Corn: స్వీట్ కార్న్ వడలు చేసుకోండీ ఇలా

- Advertisment -
- Advertisment -

Sweet Corn Vada: వర్షాకాలంలో(Monsoon Season) ఎవరికైనా వేడి వేడిగా తినాలని కోరిక ఉండటం సహజం. ముఖ్యంగా చిరు జల్లులు పడుతున్న సమయంలో చిరుతిళ్లు(Street Food) నోరురించడంలో ముందుంటాయి. మరి అలాంటి ఫుడ్ అందించే తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లు మనకెప్పుడు అందుబాటులో ఉండకపోవచ్చు.ఆ టైమ్ లో వేడి వేడి గా ఏది ఐనా తినాలి అనిపిస్తుంది కదా అప్పుడు ఒక కప్పు టీ తో ఒక మంచి స్నాక్స్ (Snacks) కూడా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఫాస్ట్ గా స్వీట్ కార్న్ తో వడలు చేసుకుని తినండి. స్వీట్ కార్న్ వడలు(Sweet Corn Vada) ఎంతో సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.. స్వీట్ కార్న్ ఆరోగ్యానికి (Health) మంచిది. ఇందులో అనేక పోషక విలువలు(Nutritional values) ఉన్నాయి. స్వీట్ కార్న్ తో వడలు చేసి మీ పిల్లలు చాలా ఇష్టం గా తింటారు. వారికి ఈ స్నాక్ చాలా బాగా నచ్చుతాయి. పిల్లలకి కొంచం కారం తక్కువ వేసి చేశారు అంటే మనం తినిపించే పని లేకుండా వల్లే ఇష్టం గా తేనెస్తారు. మనకు తినిపించే పని కూడా ఉండదు.స్వీట్ కార్న్ ఏ సీజన్ లో ఐనా మనకు మార్కెట్ (Market) లో అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఎంతో తేలికైన స్వీట్ కార్న్ వడలు తయారీ గురించి తెలుసుకుందాం..

(స్వీట్ కార్న్ తో ప్రయోజనాలు)

కావలసిన పదార్థాలు : ఒక మూడు కప్పు స్వీట్ కార్న్ గింజలు (Sweet corn), ఆరు పచ్చిమిరపకాయలు (Green chili),  ఒక వెల్లుల్లి,  నూనె (Oil), కొద్దిగా కొత్తిమీర(Coriander), జీలకర్ర (Cumin seeds), తగినంత ఉప్పు (Salt), ఒక ఉల్లిపాయ (Onion), కావలసినంత కారం (Red chili powder),కొంచెం చాట్ మసాలా (Chat masala), రెండు టేబుల్ స్పూన్ ల బియ్యంపిండి (rice flour).

మిక్సీలో వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో స్వీట్ కార్న్ గింజలు వేసి బాగా మెత్తగా కాకుండా మిక్సి పట్టాలి.. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి (Bowl) తీసుకోవాలి.  చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చి మిరపకాయ లను స్వీట్ కార్న్ మిశ్రమంలో వేసి బాగా కలపాలి (Mix well). తర్వాత ఇందులో మీకు కావలసినంత కారం తగినంత ఉప్పు కొంచెం చాట్ మసాలా, పావు కప్పు బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో సరిపడా నూనె వేసి బాగా వేడి చేయాలి. ఇలా వేడెక్కిన నూనెలో స్వీట్ కార్న్ మిశ్రమాన్ని  వడలుగా చేసుకొని నూనెలో వేయాలి. ఎక్కువ మంట పై చేస్తే గారెల లోపల ఉడకాకుండా పచ్చిగా ఉంటాయి. తక్కువ మంట (Low flame) మీద వడలను ఢీ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వడలు బాగా ఫ్రై అవుతాయి. అంతే సింపుల్ గా చేసుకునే స్వీట్ కార్న్ వడలు రెడీ (Ready). వీటిని ఒక ప్లేట్ లో పెట్టి టమోటా సాస్ తో పిల్లలకి ఇవ్వండి ఎంతో ఇష్టంగా తింటారు. పెద్దవారు అయితే నిమ్మకాయ రసం పిండి చాట్ మసాలా వేసుకొని ఉల్లిపాయ ముక్కలతో తింటే దీని ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదు అంతా యమ్మి గా ఉంటాయి.

చిట్కా: వడలు వేయడం రాకపోతే  టీ స్టీల్ జాలీ(Strainers) వెనుక కొంచం నూనె రాసి స్వీట్ కార్న్ మిశ్రమాన్నిఒక చిన్న ముద్ద తీసుకొని  గుండ్రంగా చేసి మద్యలో ఒక చిన్న రంధ్రం చేసి నూనె వేస్తే అయిపోతుంది. ఇలా చేస్తే మీకు సులభంగా వచ్చేస్తుంది.
               

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -