end
=
Monday, September 9, 2024
వార్తలుఅంతర్జాతీయంసైనికుల తిరుగుబాటు... మాలి దేశాధ్యక్షుడు రాజీనామా
- Advertisment -

సైనికుల తిరుగుబాటు… మాలి దేశాధ్యక్షుడు రాజీనామా

- Advertisment -
- Advertisment -

2018లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీం బొవకా కేటా మాలి దేశానికి అధ్యక్షుడయ్యారు. అయితే ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అటు ప్రజలు, అధికారులు, సైనికులు కూడా ఇబ్రహీం బొవకా మీద చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రజా పాలన సరిగా చేయలేకపోవడం, అవినీతి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టకపోవడం, మతహింసను ప్రేరేపించడం, సమర్థించడం తదితర అంశాల మీద రెండు సంవత్సరాలుగా ఇబ్రహీం బొవకా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాలిలో గత కొన్ని నెలలుగా ప్రజలు భారీ నిరసనలు చేపట్టారు. సైనికులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. మత పెద్ద మహమూద్ డికోకు చెందిన కొత్త ప్రతిపక్ష కూటమిని ప్రభుత్వంలో కలవాలంటూ కేటా చేసిన ప్రతిపాదనను ఆ కూటమి తిరస్కరించింది. దేశంలో సంస్కరణలకు పిలుపునిచ్చింది.

సైనికుల తిరుగుబాటు

మాలి దేశ సైనికులు ముందుగా బమాకో నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యాంపును స్వాధీనపరుచుకొని ఆ తర్వాత రాజధానిలో కవాతు చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు బొవకా కెటా రాజీనామా చేయాలంటూ ప్రజలు నినాదాలు చేస్తూ వీధుల్లో గుమిగూడి సైనికులకు మద్దుతు తెలిపారు. అధ్యక్షుడి నివాసంలోకి చొరబడ్డ సైనికులు ఆయనతోపాటూ, అక్కడే ఉన్న ప్రధానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కొన్ని గంటలకు బొవకా కెటా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

మాలీలో సైనికుల తిరుగుబాటుకు మద్దతుగా నిలిచిన నిరసనకారులు

మాలీలో జరిగిన సంఘటనలపై, అత్యవసర పరిస్థితులపై చర్చించేందుకు బుధవారం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం అవుతోంది

( రెప్పపాటులో తప్పిన ప్రమాదం… వృద్ధుడు సేఫ్‌ )

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -