end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంగొంతు కోసీ...ఆపై ఉరి వేసి...
- Advertisment -

గొంతు కోసీ…ఆపై ఉరి వేసి…

- Advertisment -
- Advertisment -

మహారాష్ర్ట ః పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినందుకు ఓ యువతి గొంతుకోసేశాడు ఓ ప్రబుద్ధుడు. పైగా ఆ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి విఫలయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ర్టలోని థానే జిల్లాలో ఈ ఘోరం జరిగింది. 2వ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ రాజ్‌కుమార్‌ షిండే తెలిపిన వివరాలు ఇలావున్నాయి. కళ్యాణ్‌ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి భీవండి ప్రాంతంలో పనిమనిషిగా చేరింది. అయితే గోవింద్‌వాడకి చెందిన దీపక్‌ రూపవతే అనే యువకుడు ఆ యువతితో ప్రేమలో పడ్డాడు. విచిత్రమేమంటే ఈ ఇద్దరికీ ఇది వరకే వేర్వేరు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఇద్దరు సన్నిహితంగా ఉంటూ ఒకరిపై ఒకరు ఇష్టపడ్డారు. కావున ఆయువకుడు పెళ్లి చేసుకుందామని సదరు మహిళను అడుగగా నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువకుడు ఈ నెల 9న యువతి గొంతుకోసి చున్నీతో ఉరివేసి ముంబై – నాసిక్‌ బైపాస్‌ రోడ్డులో చెట్టుకు వేలాడదీశాడు. నిందితున్ని శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

( కవి ఏలేశ్వర నాగభూషణ ఆచార్య మృతి )

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -