end
=
Tuesday, January 21, 2025
ఫీచ‌ర్స్ ‌మనసుకు నచ్చింది చేస్తేనే బతుక్కి అర్థం కదా..
- Advertisment -

మనసుకు నచ్చింది చేస్తేనే బతుక్కి అర్థం కదా..

- Advertisment -
- Advertisment -

ఓ మంచి ఉద్యోగంలో స్థిరపడిపోయిన మనిషి ఇప్పుడు తనని తాను వెతుక్కుంటూ నిర్మించుకున్న జీవితం ఇది. ఇంత రిస్క్‌ ఎందుకు తీసుకున్నారు అని అడిగితే… ‘మనసుకు నచ్చింది చేస్తేనే, బతుక్కి అర్థం కదా!’ అని నవ్వేస్తూ.. ఆమె ప్రయాణం ఆమె మాటల్లో… నాకు ‘స్లో జర్నలిజం’ అంటే చాలా ఇష్టం. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా, నిదానంగా గమనిస్తూ… జీవితానికి అద్దం పట్టే నివేదికలా వార్తలను రూపొందించడం! కార్పొరేట్‌ ఉద్యోగంలో కూడబెట్టుకున్న డబ్బులన్నీ, గ్రాంట్‌ల ద్వారా వచ్చే సాయాన్నీ వాడుకుంటూనే, వృత్తిని కొనసాగిస్తున్నా..

కర్ణాటక నుంచి అసోం వరకు కెమెరా భుజాన తగిలించుకుని ఓ బాటసారిలా సాగిపోతోంది ‘ఆరతి’. ఓసారి ‘ఔట్‌ ఆఫ్‌ ఈడెన్‌ వాక్‌’ అనే ప్రాజెక్టులో భాగంగా, రాజస్తాన్‌ ఏడారిలో ఏకంగా ఆరు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఒక ఆడపిల్ల ఇలా ఎక్కడికైనా చొచ్చుకుపోవడం సాధ్యమేనా అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. నిజానికి నాకు ఎప్పుడూ ప్రమాదం అనిపించలేదు. ఎక్కడికక్కడ స్థానికులు నన్ను ఆదరిస్తూనే ఉంటారు. సర్వం కోల్పోయిన వాళ్లు కూడా, నాకు ఓ ముద్ద పెట్టేందుకు సిద్ధపడిన సందర్భాలు ఉన్నాయి. 

నేను రాజస్థాన్‌ ఎడారిలో ఉండగా అక్కడి పశువుల కాపరి పరిచయం అయ్యాడు. తను వర్షం కోసం ఎన్నో రోజులుగా నిరీక్షిస్తున్నాడని తెలిసి ఫలితం లభిస్తుందా లేదా అని నాలో కూడా ఆసక్తి పెరిగిపోయింది. చివరికి వర్షం రానే వచ్చింది. ఒకే రోజు ఎనిభై మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఆ నీటినంతా పశువుల కాపరి చత్తర్‌సింగ్‌ ఆ నీటిని అపురూపంగా దాచుకున్నాడు. బెంగళూరులో వర్షాలే వర్షాలు… కానీ తాగడానికి నీటి కొరత. నీటి వనరుల లభ్యత కంటే వాటిని వినియోగించుకోవడం ముఖ్యం అని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. ఫొటోగ్రాఫర్‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్నా. దృష్టంతా నదుల మీదే. సుందర్‌బన్‌లో మడ అడవులు, గంగ పరీవాహక ప్రాంతాలు, రాజస్థాన్‌లో ఒయాసిస్సులు… జీవజాతుల మీదా, మత్స్యకారుల మీదా వరుస కథనాలతో నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. ‘నగరాల్లో ఉండేవాళ్లు, పర్యావరణం గురించి ఓ నాలుగు మాటలు మాట్లాడేసి, తమ బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. మాటలు సరిపోవు ఒకసారి పర్యావరణంలోకి వస్తే అర్థం అవుతుంది. అడవులను కాపాడుకోవడం మన కర్తవ్యంగా బావించినప్పుడే మనకు సరైనా ఆక్సీజన్‌ అంది సుఖంగా జీవించగలుగుతాం..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -