- అధికారులతో మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం
మనోహరబాద్ రైల్వే పనులపై మంత్రి హరీష్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రైల్వేలైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి, రైల్వే శాఖ, ఆర్‌అండ్‌బి శాఖ, రెవెన్యూ విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి హరీష్‌రావు సమావేశం నిర్వహించి, రైల్వే పనులు సమీక్షించారు. (సింగూరుపై రైతుల్లో కొత్త ఆశలు)
స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన రైల్వేష్టేషన్ అని, సీఎం నియోజకవర్గం గజ్వేల్ మీదుగా ఈ లైను వెళ్తున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో పనులలో అలసత్వం, ఆలస్యం జరగకూడదని తెలిపారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో సమావేశమై భూసేకరణ పనులు తొందరగా పర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. అలాగే రైల్వేలైన్ కోసం విద్యుత్ అవసరమైన చోట సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు వేగపరచాలని తెలిపారు.
- అధిక ముసురుతో పంటలకు నష్టం
- ‘డ్రాగన్’కు గట్టి షాకిచ్చిన భారత్
- boAt Airdopes 131 ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ విడుదల