మావోయిస్టు మాజీ కార్యదర్శి, సీనియర్ నాయకుడు గణపతి అలియాస్ లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు మీడియా వర్గాల తెలిసింది. ఆయన అనుచరులు ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు చివరిదశలోఉన్నట్లు సమాచారం
గణపతి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు తెలిసింది. ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహం సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారని, ఆయనను ఎక్కడికి తీసుకెళ్లాలన్నా మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఈ స్థితిలో ఆయన లొంగిపోయి ఆసుపత్రిలో చేరడమే మంచిదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భారీగా ఉగ్రవాదుల ఆయుధాలు పట్టివేత
గణపతి లొంగుబాటుకు తెలంగాణ పోలీసులు చొరవ తీసుకోవడం, ఇటు కేసీఆర్ ప్రభుత్వం, అటు మోదీ సర్కారు కూడా సుముఖంగా ఉండటంతో ఆయన త్వరలోనే లొంగిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.