end

మరింత అవగాహన పెంచాలి

  • తూప్రాన్ పీహెచ్సీని సందర్శించిన డబ్ల్యూహెచ్ఓ అధికారులు

కరోనా వైరస్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలని డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ పీహెచ్సీని గురువారం ఆయన సందర్శించారు. పట్టణంతో పాటు మండలంలో కరోనా వైద్య పరీక్షలు ఎలా జరుగుతున్నాయి..? పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హోమ్ క్వారంటైన్‌లో ఉంచుతు న్నారా..? వారికి ఎలాంటి మందులు ఇస్తున్నారు.. ఇంతవరకు ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. తదితర అంశాలపై పీహెచ్సీ డాక్టర్ ఆనంద్‌ను అడిగి తెలుసుకున్నారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో గురువారం వరకు 10 మంది మృతి చెందగా 210మందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని డాక్టర్ ఆనంద్ చెప్పారు.

పాజిటివ్ సోకిన వ్యక్తులకు అవసరమైన మందులు అందజేస్తూ బాధితులకు తగిన జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నామని శ్రావణ్ కుమార్ రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ డాక్టర్ మాట్లాడుతూ కరోనా నివారణకు ప్రజాప్రతినిధులు, ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, మాన్క్ లు ధరించడం, భౌతికదూరం పాటించడంపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

Exit mobile version