మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్‌తో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మర్రి ఆదిత్య రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆదిత్యరెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మర్రి ఆదిత్య రెడ్డి స్వయాన మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు. తాత పేరుతో స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
సీఎం వ్యక్తిగత కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు కోవిడ్
అయితే ప్రజలకు ఇంకా ఎంతో సేవ చేయాలనే కోరికతో పూర్తి తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆదిత్యరెడ్డి తెలిపారు. మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ ద్వారా యువత, మహిళలు, చేనత కార్మికులకు ఉపాధి, రైతులకు సహాయం, అలాగే కరోనా కష్ట కాలంలో ప్రజలకు మందుల పంపిణీ, ఆహారం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.