end

మరిదితో అక్రమసంబంధం… ఆత్మహత్య

మరిదితో అక్రమసంబంధం పెట్టుకున్న విషయం అందరికీ తెలియడంతో ఆ ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దేవరకద్ర మండలంలోని గోపనపల్లి గ్రామానికి చెందిన ఎంపిటిసి ఆంజనేయులు రెండో భార్య అర్చన(23) వరకు మరిది మధు(22)తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ విషయం ఊళ్లో అందరికి తెలియడంతో మనస్థాపానికి గురై ఆ ఇద్దరూ ఆత్మహత్యచేసుకోవాలని భావించి ఇద్దరు కలిసి ఒకే చీరకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వారి వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలోనే అర్చన మృతి చెందగా మధు పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవికూడా చదవండి….

రోడ్డు ప్రమాదంలో ఏసీపీ కుటుంబ సభ్యులు మృతి

రేషన్‌ దుకాణాలు బంద్

వంశీ పైడిపల్లికి నేషనల్‌ అవార్డు

Exit mobile version