end
=
Sunday, January 26, 2025
సినీమాగోపీచంద్‌తో మారుతి కొత్త చిత్రం
- Advertisment -

గోపీచంద్‌తో మారుతి కొత్త చిత్రం

- Advertisment -
- Advertisment -

‘ప్రతిరోజు పండగే’ సక్సెస్‌ తర్వాత సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ మారుతి తాజా చిత్రాన్ని ప్రకటించారు. మాస్‌ హీరో గోపీచంద్‌తో ఓ కమర్షియల్‌ సినిమా చేయడానికి మారుతి సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ – యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపీచంద్‌ – మారుతి కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించి మారుతి మార్క్‌ స్టైల్‌లో ఓ హ్యూమరస్‌ వీడియో సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. గోపీచంద్‌కు ఇది 29వ సినిమా కాగా, దర్శకుడిగా మారుతికి పదో సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను త్వరలో విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి బన్నీవాసు నిర్మాత.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -