end

టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

  • దాదాపు 40కోట్ల రూపాయల విలువ చేసే బట్టలు కాలిబూడిద

టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గోదాంలో నిల్వ ఉన్న బట్టలన్నీ తగలబడి బూడిదయ్యాయి. గీసుకొండ మండలం ధర్మారం బాలవిరం టెస్కో గోదాంలో అనుమానాస్పదంగా అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మంటలు పెద్దగా ఎగిసిపడడంతో గోదాం గోడు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో భారీగానే ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు 40కోట్ల రూపాయల విలువ చేసే బట్టలు తగలబడిపోతున్నాయని టెస్కో అధికారులు వెల్లడించారు. పాఠశాలలకు అందించాల్సిన చేనేత దుస్తులు అందులోనే ఉండిపోయాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సరియైన కారణయాలు ఇంకా తెలియడం లేదని వాపోయారు. అసలే వేసవి కాలం. అందులోనూ ఎన్నడూ లేని విధంగా ఎండలు భగ భగ మండుతున్నాయి. కరెంట్‌ షార్ట్ సర్క్యూట్‌ వల్ల జరిగిందా? లేక ఎవరైనా కావాలనే నిప్పు అంటించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Exit mobile version