end
=
Friday, July 5, 2024
బిజినెస్‌భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Advertisment -

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

- Advertisment -
- Advertisment -

దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి డిమాండ్‌ ఒక్కసారిగా పడిపోవడం ఇందుకు కారణమైంది. మంగళవారం ముంబై స్పాట్‌ మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం ధర తులానికి(10 గ్రాముల బంగారం) రూ.1,755 తగ్గి రూ.50,665కు చేరుకుంది. 99.5 స్వచ్ఛత లోహం రేటు రూ.1,748 తగ్గి రూ.50,462కు పరిమితమైంది. కిలో వెండి ధర ఏకంగా రూ.4,268 తగ్గి రూ.61,784కు దిగివచ్చింది.

హైదరాబాద్‌ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,640 తగ్గి రూ.51,380కి చేరుకోగా.. కేజీ సిల్వర్‌ రూ.3,500 తగ్గి రూ.61,900 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు ఒక దశలో 1,877 డాలర్ల వద్ద, వెండి రూ.24 డాలర్ల ఎగువన ట్రేడయ్యాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -