end
=
Thursday, November 21, 2024
వార్తలుజాతీయం21 ఏళ్లకే మేయర్‌ పదవి
- Advertisment -

21 ఏళ్లకే మేయర్‌ పదవి

- Advertisment -
- Advertisment -

తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువంతపురంలో ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 21 ఏళ్ల యువతి మేయర్ పీఠాన్ని అధిరోహించి, అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. దేశ రాజకీయాల్లోనే ఇదో రికార్డు. వివరాలు చూస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 21 ఏళ్ల వయసులోనే ఆర్యా రాజేంద్రన్ అనే అమ్మాయి మేయర్ పీఠాన్ని అధిష్టించనుంది. ప్రస్తుతం కళాశాల విద్యను అభ్యసిస్తున్న ఆమె అతి చిన్న వయసులో ఆ పదవిని చేపట్టనున్నారు. సీపీఎం పార్టీకి చెందిన తిరువనాథపురం జిల్లా సచివాలయం ఆమె పేరును ఈ పదవికి చూచించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సిఫార్సును పార్టీ క్యాడర్ అనుమతించింది.

ఆర్యా రాజేంద్రన్ తిరువనాథపురంలోని ఆల్‌ సెయింట్స్‌ కళాశాలలో న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఆమె ముదవన్‌ మునగల్ వార్డు నుంచి విజయం సాధించారు. అలాగే ఈ సారి పార్టీ నియమించిన అతి చిన్న వయసు అభ్యర్థి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -