end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంనేరాల అదుపునకు కృషిః జిల్లా యస్.పి చందన దీప్తి
- Advertisment -

నేరాల అదుపునకు కృషిః జిల్లా యస్.పి చందన దీప్తి

- Advertisment -
- Advertisment -

నేరాల అదుపునకు పోలీసులు తీవ్రంగా కృషి చేయాలని మెదక్‌ జిల్లా ఎస్పీ చందనా దీప్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో వీడియో కాన్ఫరెన్స ద్వారా పోలీసు సిబ్బందికి సూచించారు.ఈ సమీక్ష నందు కేసు ఫైల్స్ యొక్క స్థితిగతులను, పురోగతిని పరిశీలించారు. తీవ్రమైన నేరాల దర్యాప్తులో ప్రణాళికను అమలు చేయాలని అన్నారు. మహిళ సంబంధిత కేసుల్లో విచారణ వేగవంతంగా చేయాలని తెలిపారు. నేరం జరిగిన ప్రాంతాన్ని వీడియోలు, ఫోటోలు తీసుకోవాలని, కేసులు పెండింగ్ లేకుండా వేగంగా నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని సూచించారు.

అలాగే నేరాలకు పాల్పడే వారికి జైలు శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఏదైనా కేసుకు సంబంధించిన వైద్యుల సర్టిఫికెట్స్, FSL రిపోర్ట్స్ త్వరగా తీసుకోవాలని, కేసుల విషయంలో పారదర్శకంగా పని చేస్తూ బాధితులకు భరోసా కలిగే విధంగా స్పందించాలని తెలిపినారు.

సర్కిల్ CI లు, సబ్ డివిజన్ DSP లు కేసుల యొక్క నమోదు, పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

ఈ కాన్ఫరెన్స్‌లో మెదక్ DSP శ్రీ. కృష్ణమూర్తి మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకట్ , మరియురామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ. నాగార్జున గౌడ్ నర్సపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లింగేశ్వర్ అల్లదుర్గ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి డి.సి.ఆర్.బి. సి.ఐ శ్రీ. చందర్ రాథోడ్ గారు,ఐ. టి మెదక్ రూరల్ సి.ఐ శ్రీ పాలవెళ్లి గారు, తూప్రాన్ సి.ఐ శ్రీ.స్వామి కోర్ ఎస్.ఐ శ్రీ.ప్రభాకర్ మరియు ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -