end
=
Friday, April 4, 2025
బిజినెస్‌Meesho:ఉద్యోగులందరికీ 11 రోజుల సెలవులు.. ఎందుకో తెలుసా?
- Advertisment -

Meesho:ఉద్యోగులందరికీ 11 రోజుల సెలవులు.. ఎందుకో తెలుసా?

- Advertisment -
- Advertisment -

ఉద్యోగ జీవితంలో మనిషి ఒత్తిడితో చిత్తవుతున్నాడనేది నగ్న సత్యం. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకన్నా ప్రవైట్ కంపెనీల్లో (Private Company) పనిచేసే వారి పరిస్థితి మరింత దారుణం. కొన్నిసార్లు డిప్రెషన్ (Depression) తట్టుకోలేక ఎంతోమంది ఎంప్లాయిస్ (Employees) జాబ్ రిజైన్ (Resign) చేయగా.. మరికొంతమంది సూసైడ్ (Suicide) చేసుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే తమ కార్మికులను ఉల్లాసపరిచేందుకు కొన్ని కంపెనీలు విభిన్న ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ (e-commerce company) ‘మీషో’ (meesho) ఉద్యోగుల శ్రేయస్సు కోసం 11 రోజుల ‘రీసెట్ అండ్ రీచార్జ్’ (‘Reset and Recharge’) ప్రకటించింది. ఎంప్లాయ్స్ ఆరోగ్యానికి ప్రాధానత్యనిచ్చే క్రమంలో బెంగళూరుకు చెందిన ఈ ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్.. ప్రస్తుత పండుగ సీజన్ రద్దీ తగ్గిన తర్వాత ఎంప్లాయిస్ అందరికీ ఈ సెలవులను అమలుచేయనుంది. అక్టోబర్ 22, 2022 నుంచి నవంబర్ 1, 2022 వరకు ఈ వెసులుబాటును ఉపయోగించవచ్చు. కాగా గతేడాది కూడా ‘మీషో’ ఇదేవిధమైన చొరవతో ప్రశంసలు అందుకోగా మరోసారి ఈ నిర్ణయంతో ప్రజల మన్ననలు పొందుతుంది.

ఈ పదకొండు రోజుల సెలవుల్లో తమ ఎంప్లాయిస్ ఒత్తిడినుంచి బయటపడి రీఫ్రెష్ మైండ్‌తో (Refresh mind) మరింత మెరుగ్గా పనిచేస్తారని భావించి ఈ డెసిషన్ తీసుకున్నట్లు సదరు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. అంతేకాదు ‘ప్రస్తుతం వర్క్ ప్లేస్‌లో బర్న్‌అవుట్, యాంగ్జయిటీ (Burnout, anxiety) వంటి ఆందోళనలు ప్రధానంగా ఉద్భవిస్తున్నందున ‘రీసెట్ అండ్ రీచార్జ్’ అనేది ‘ఎంప్లాయ్-ఫస్ట్ ప్రాక్టీసెస్’ (‘Employee-First Practices‘) అవలంబించేందుకు ఇతర కంపెనీలకు కూడా మార్గాన్ని చూపుతుంది’ అని మీషో అధికారిక ప్రకటనలో వెల్లడించింది. కాగా వర్క్-లైఫ్ బ్యాలెన్స్ (Work-life balance) ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ యునికార్న్ స్టార్టప్ ఫౌండర్ & చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సంజీవ్ బర్న్‌వాల్ (Sanjeev Barnwal).. ట్విట్టర్‌ (Twitter)లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే కార్పొరేట్ ముసుగులను తొలగించి చూస్తే ఇది ఉత్తమంగా కనిపిస్తుందన్నారు. ఇక ‘రీసెట్ అండ్ రీచార్జ్‌’ ద్వారా సంప్రదాయ కార్యాలయ నిబంధనలను పునర్నిర్వచించడాన్ని కొనసాగిస్తాం’ అని మీషో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ (HR) ఆఫీసర్ ఆశిష్ కుమార్ సింగ్ పేర్కొన్నగా కార్మికులంతా మెనేజ్‌మెంట్‌పై నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు.  

ఇక ఇలాంటి ప్రగతిశీల విధానాలు ఉద్యోగి కేంద్రీకరణతో పాటు ఇండస్ట్రీలో (Industry) వారి నిలుపుదల రేట్లను పెంపొందించడంలో సాయపడతాయని కంపెనీ హెచ్‌ఆర్ వెల్లడించారు. 2015లో స్థాపించబడిన ఈ సంస్థ.. గతంలో ‘బౌండరీలెస్’ (Boundary less) వర్క్‌ప్లేస్ మోడల్‌ సహా అవసరమైనన్ని వెల్‌నెస్, జెండర్-న్యూట్రల్ పేరెంటల్ లీవ్స్ (Leaves) కల్పించడంలో ముందుంది. ఇక దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్న నెటిజన్లు.. ఇలాంటి మంచి పనులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాజమాన్యాలన్నీ పాటిస్తే భూ గోళాన్ని అద్భుతంగా తీర్చిదిద్దవచ్చంటున్నారు.

(విశ్వనగరంగా హైదరాబాద్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -