end
=
Monday, January 20, 2025
సినీమాహీరోయిన్‌ లేకుండానే మెగాస్టార్‌ మూవీ..?
- Advertisment -

హీరోయిన్‌ లేకుండానే మెగాస్టార్‌ మూవీ..?

- Advertisment -
- Advertisment -

మోహన్ లాల్ నటించిన మలయాళ సినిమా లూసిఫర్ మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చింది. ఈ సినిమా కథ తనకు సరిపోతుందని, తెలుగులో రీమేక్ చేయాలని ఆయన భావించారు. అయితే ఈ సినిమాను ఏ డైరెక్టర్‌ చేతిలో పెట్టాలనే విషయంలో క్లారిటీ రావడం లేదు. సాహో డైరెక్టర్ సుజిత్, బాబి, వీవీ వినాయక్, హరీష్ శంకర్ పేర్లు వినిపించాయి.

ఇప్పుడు మాత్రం తమిళ దర్శకుడు మోహన్‌ రాజా పేరు తెర మీదకు వచ్చింది. మలయాళ సినిమాలో మోహన్ లాల్‌కు హీరోయిన్ ఉండదు. తెలుగు రీమేక్‌లో చిరంజీవి ఇమేజ్‌కు అనుగుణంగా పలు మార్పులు చేశారని, హీరోయిన్‌ పాత్ర ఉంటుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే తెలుగులో కూడా హీరోయిన్‌ లేకుండానే సినిమాను తెరకెక్కించనున్నారని తాజా సమాచారం. కథానాయకుడి పాత్రలో చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప.. కథానాయిక పాత్రను కొత్తగా సృష్టించలేదని తెలుస్తోంది.

సాధారణంగా పక్కా కమర్షియల్‌ సినిమాలు చేసే మెగాస్టార్‌.. కథానాయిక లేకుండా సినిమా చేయడం అరుదు. కానీ, ఈ సినిమా అందుకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. అనవసరంగా లేని పాత్రలు సృష్టించడం ఎందుకని సాహసం చేయడం లేదు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -