end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంకలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం
- Advertisment -

కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం

- Advertisment -
- Advertisment -

ఓటాబందీ గ్రామ సేవకుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాల్వ నరేష్, ఉపాధ్యక్షులు అస రవి మాట్లాడుతూ గ్రామాలలో గ్రామ సేవకులుగా పనిచేస్తున్న వారికి వతందారులు వారి అకౌంట్ లో ప్రభుత్వమే ఇస్తున్నటువంటి జీతాలను వంతుల వారి గ్రామ సేవకులకు ఇవ్వడం దొంగ జీవోలు తీసుకువచ్చి ఓటాబంది గ్రామ సేవకులను విధులకు హాజరుకాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ముత్తాతలు, తాతలు, తండ్రులు అప్పటినుంచి చేస్తున్నటువంటి వతన్ లను అసలుదారులు దొంగ దీక్షలు చేస్తూ ఓటబంది గ్రామ సేవకులను చేయనివ్వడం లేదు.

దానికి పూర్తి వ్యతిరేకంగా సిద్దిపేట జిల్లాలో తిరుగుబాటు ఉద్యమం మొదలుపెట్టడం జరిగిందన్నారు. మా న్యాయమైన సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. అసలుదారుల జీవోను రద్దు చేసి పేస్కేలు రద్దుచేసి పాత పద్ధతిలోని పనిచేసే వారికి జీతాలు ఇవ్వాలి అన్నారు. ఈ కార్యక్రమంలో తొగుట మండల అధ్యక్షులు చందారాజు, నంగునూరు మండల అధ్యక్షులు అనిల్, దుబ్బాక మండల అధ్యక్షులు భాస్కర్, చిన్నకోడూరు మండల అధ్యక్షుడు రాజు, మంగమ్మ , వనజ, లక్ష్మణ్, రాములు, కిరణ్, ఓటబంది గ్రామ సేవకులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -