end
=
Sunday, January 19, 2025
క్రీడలుక్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం
- Advertisment -

క్రీడలతోనే యువతకు మానసిక ఉల్లాసం

- Advertisment -
- Advertisment -
  • క్రికెట్ టోర్నీ ప్రారంభించిన ఎన్నారై తోట రామ్ కుమార్

వేములవాడ: క్రీడలతోనే యువకులకు మానసిక ఉల్లాసం పెంపొందుతుందని టి ఆర్ కె ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ ఎన్నారై తోట రామ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం వేములవాడ పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ఆవరణలోని క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న శ్రీ మహాలక్మి క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామ్ కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా రంగంలో రాణించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు ఎల్లవేళలా టి ఆర్ కె ట్రస్ట్ అండగా ఉంటుందని తెలియజేశారు. ముందుగా క్రికెట్ టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభించి రామ్ కుమార్ బ్యాటింగ్ చేశారు.

ఈ టోర్నీలో మొత్తం 4 టీమ్ లు పాల్గొనగా 24 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఇందులో గెలుపొందిన విజేతకు టి ఆర్ కె ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతిగా రూ. 20016 అందించనున్నారు. ఈ టోర్నీ 12 రోజులు జరగనున్నట్లు టోర్నీ నిర్వాహకులు బైరి సతీష్ పండు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.ఆర్.కె ట్రస్ట్ డైరెక్టర్ వుప్పుల దేవరాజ్, మొట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయిని శేఖర్, టి ఆర్ కె ట్రస్ట్ వర్కింగ్ టీమ్, ఎంక్వరి టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -