- ఎయిర్ ఇండియా మాజీ పైలట్‌అరెస్టు
Mephedrone Drugs :ఎయిర్ ఇండియా మాజీ పైలట్ నుండి సుమారు 120 కోట్ల విలువైన డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబై వేర్‌హైజ్ నుండి స్వాధీనం చేసుకుంది. ఎయిర్ ఇండియాలో(Air India Pilot) గతంలో పైలట్‌గా పని చేసిన సోహెల్ గఫార్‌ను(Sohel Gafar) అరెస్టు చేశారు. కాగా గుజరాత్ డ్రగ్స్ కేసులో(GujaratDrugs Case) కూడా గఫార్‌కు సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జామ్‌నగర్‌కు (Zamnagar) చెందిన నేవీ ఇంటెలిజెన్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ముంబైల్‌లోని వేర్‌హౌజ్‌ను నార్కోటిక్స్ శాఖ తనిఖీలు చేపట్టగా 60 కేజీల మెఫిడ్రోన్‌ను(Mephedrone) పట్టుకున్నారు. ఇప్పటి వరకు 225 కేజీల మెఫిడ్రోన్ డ్రగ్‌ను విదేశీ డ్రగ్ కార్టెల్ మార్కెట్‌లో విక్రయించింది. అయితే గురువారం నాడు 60 కేజీల మెఫిడ్రోన్‌ను పోలీసులు పట్లుకున్నారు.
(Rain Alert:ఈనెల 9న మరో అల్పపీడనం..)
అమెరికాలో పైలట్ శిక్షణ పొందిన గఫార్ ఎయిర్ ఇండియాలో పైలట్‌గా పని చేశారు. ఆరోగ్య కారణాల వల్ల ఉద్యోగానికి రాజీమానా చేశారు. అయితే ఈ డ్రగ్స్ కలకలం గుజరాత్ కేంద్రంగా నడుస్తోంది. వడోదరలో ఆగస్టు నెలలో 200 కేజీల మెఫిడ్రోన్‌ను గతంతో సీజ్ చేశారు. అలాగే ముంద్రా ఎయిర్‌పోర్టులో(Mundra Airport) కూడా సుమారు 21 వేల కోట్ల విలువైన 3 వేల కిలోల డ్రగ్స్‌ను పట్టుకున్న సంగతి తెలిసందే. ఎక్కువశాతం గుజరాత్‌లోనే డ్రగ్ కేసులు నమోదవుతుండడంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(Munugodu Elections : మనుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల)