end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌వంటలుచికెన్ పకోడా తయారీ విధానం
- Advertisment -

చికెన్ పకోడా తయారీ విధానం

- Advertisment -
- Advertisment -

సాయంత్రం సమయం లో అది వర్షా కాలంలో ఏది అయిన వేడివేడిగా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా. అప్పుడు ఇలా చికెన్ తో ట్రై చేసి చూడండి. చికెన్‌ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా. దీంతో ఎన్నో రెసిపీస్‌ని ఇంట్లో తయారు చేసుకుని తింటుంటారు. ఈజీ గా తయారు చేసుకునే మంచి స్నాక్ రెసిపీస్‌లో చికెన్ పకోడా ఒకటి. ఇది చక్కని స్టార్టర్ ఐటెమ్‌కూడా. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా..

ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, పసుపు, 2 గుడ్లు, తురిమిన వెల్లుల్లి, అల్లం, కరివేపాకులు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, ఇంగువ, బేకింగ్ పౌడర్ అన్నీ కలిపి వేసుకోవాలి . ఇప్పుడు వాటిలో తగినంత నీరు పోసి బాగా కలపాలి. అందులో చిన్న చిన్న ముక్కలుగా చేసిన చికెన్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల వెనిగర్ వేయాలి.ఇలా తయారైన మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో 30 నిమిషాల వరకూ నానపెట్టాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు నూనె వేడి కాగానే ముందుగా కలిపిన చికెన్ మిశ్రమాన్ని పకోడీల్లా వేయాలి. ఇవి బంగారు రంగులోకి మారేవరకూ ఫ్రై చేయాలి. ఇలా తయారైన పకోడీలు సాయంత్రం వేళల్లో చాలా బాగుంటుంది. వీటిని సాస్‌తో తినొచ్చు లేదా అలానే తినొచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -