అధికార టీఆర్‌ఎస్ పార్టీ, ఎంఐఎం మిత్ర పక్షంగా చెప్పుకునే పార్టీపై ఎంఐఎం ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. మేము తలుచుకుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని 2 నెలల్లో కూల్చేస్తామన్నారు. మాకు(ఎంఐఎం) గద్దెనెక్కించడమూ తెలుసు.. దించడమూ తెలుసని ఆయన హెచ్చరించారు. రాజకీయలకు కేటీఆర్ ఈ మధ్యే వచ్చాడు. అతడికేం తెలుసు రాజకీయం. మజ్లిస్ పార్టీ చాలా చూసింది. చాలా ప్రభుత్వాలను వెనుకుండి నడిపించిందన్నాడు. రాజకీయమనేది మా ఇంటి గుమాస్తాతో సమానమని అహ్మద్ ఖాన్ వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో తమకు ఎవరితోనూ దోస్తీ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎంఐఎంతో కూడా మాకు ఎంలాంటి స్నేహపూర్వక వాతావరణం లేదని, తాము ఒంటరిగానే బరిలో నిలుస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మాటలకు ఎంఐఎం ఎమ్మెల్యేకు చిర్రొత్తుకొచ్చినట్టుంది పాపం. ఎందుకంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఎంఐఎం.. టీఆర్‌ఎస్‌తో స్నేహపూర్వకంగానే ఉంటూ వస్తోంది.