మంత్రి హరీశ్ రావు(Harish rao) మాట్లాడుతూ ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురమలు. ఆనాడు న్యాయం ధర్మం పాండవుల వైపు ఉండి శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టారు. కేసీఆర్(KCR) ఏ సీఎం గతంలో చేయని రీతిలో మన గొల్ల కురుమల ఆత్మగౌరవం నిలబెట్టారు. ఆర్థికంగా నిలబెట్టారు. పరిపాలన లో నిలబెట్టారు. ఐ.ఎఎస్. ఐపీఎస్ కన్నా గొప్ప తెలివితేటలు ఉన్న వారు గొల్ల కురమలని అసెంబ్లీ(Assembly)లో కేసీఆర్ గారు చెప్పారు. ఎన్సీడీ వాళ్లు అప్పు కింద ఇచ్చారు తప్ప గతంలో నలుగురు ముఖ్యమంత్రులు ..చంద్రబాబు నుండి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎన్సీడీపై సంతకం పెట్టలేదు. కాని కేసీఆర్ గారు 75 సబ్సిడీతో గొర్రెపిల్లలు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్. ప్రభుత్వంలో ,చట్ట సభల్లో, రాజ్య సభలో ఇలా గొప్పగా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు.
కేసీఆర్ గారు ఇంత చేసినప్పుడు,మనం కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడాలి. 75 శాతంతో రాయితీతో గొర్రెలు పంపిణీ చేస్తున్న కేసీఆర్ గారిని బలపర్చాలి. కర్ణాటకలో అప్పటి మంత్రి రేవణ్ణ ఈ గొర్రెల స్కీం చూసి ఆశ్చర్యపోయారు. నేను కాంగ్రెస్ లోఉన్నా..కేసీఆర్ ను కలవాలని భావిస్తున్న అని.. కర్ణాటక నుండి హైదరాబాద్(Karnataka to Hyderabad) కు వచ్చి గొంగడి కప్పి, గొర్రెపిల్లను ఇచ్చి సన్మానించిన వ్యక్తి. ఆయనకు కాంగ్రెస్ ఇందుకు గాను నోటీసులు ఇచ్చిండ్రు. కాని కేసీఆర్ దేశంలో ఎవరూ చేయని రీతిలో గొల్ల కురమలకు చేశారని దైర్యంగా చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనపడం లేదు. కాని పక్క రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కనబడుతోంది. కురమలది, యాదవులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం జరుగుతున్నయి. రెండు మూడు నెలల్లో ప్రారంభం కానున్నాయి. బీజేపీ వాళ్లు కాంగ్రెస్ వాళ్లు చాలా మాట్లాడుతున్నరు. బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమంటే, ఇవాళ్టి వరకు బీసీ శాఖ పెట్టలేదు.
(Idea Vodafone:ఫ్లాగ్‌షిప్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసేసిన టెలికాం కంపెనీ)
రైతు బంధు, రైతు బీమా, రైతుకు ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి(Kalyana Laxmi), కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎలా ఉన్నయంటే. హుజురాబాద్ లో దళితబంధు పథకం కేసీఆర్ గారు పెడితే ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు కాగానే డబ్బులు పోతయని దుష్ప్రచారం చేశారు. కాని 24 వేల కుటుంబాలకు దళిత బంధు అమలు అయింది. ఇవాళ మన అక్కౌంట్లలో గొల్ల కురుమలు గొర్రెలు కొనుక్కోవాలని డబ్బులు వేయించారు. ఇవి రావని, సీజ్ అవుతయని జూటా మాటలు చెపుతున్నరు. రేపు ఐదో తేదీ తర్వాత ఎప్పటి లాగా మీకు నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునేలా అవకాశం కల్పిస్తరు. ఇంత బాగా పథకాలు వచ్చినయి. కాంగ్రెస్ ఉన్ననాడు కాలిపోయే మోటర్లు..పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు. రాత్రి కరెంటు బాధలు ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు, రైతు బంధు, రైతు బీమా తెచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.
బీజీపే చేసిందేంటి. సిలండర్ ధర 400 రూపాయల నుండి 1200 చేసిండ్రు. బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెడతమంటున్నరు. ఆర్థిక మంత్రిగా ఉన్న. మాకు ఉత్తరం పంపిండ్రు. మీరు బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెడితే ఏడాదికి ఆరు వేల కోట్లు ఇస్తం. ఇలా ఐదేళ్లకు 30 వేల కోట్ల ఇస్తమన్నరు. కాని కేసీఆర్ గారు ప్రాణం పోయినా మీటర్లు పెట్టేది లేదని చెప్పారు. కొద్ది మంది జూటామాటలు, పూటకోమాట మాట్లాడే వారు వస్తున్నరు. అట్టి బట్టెబాజ్ గాళ్లకు , జూటేబాజ్ గాళ్లకు మీరే బుద్ది చెప్పాలి. ఈ పోరాటంల మీరు ధర్మాన్ని నిలబెట్టండి. కొమరెల్లి మల్లన్నకు గతంలో కాంగ్రెస్,టీడీపీలు యాదవులను ఛైర్మన్ గా చేయమంటే చేయలే. గొల్ల కురమల్ని సంపత్ ను ఛైర్మన్ గా చేసిండ్రు…కేసీఆర్ గారు. ఆ గుడిని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇలా గొల్ల కురమలను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. టీఆర్ఎస్ కు మద్ధతు ఇచ్చి బలపర్చండి.