ఈరోజు ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్ ను స్టార్ట్ చేశాం. ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీ అమలు కోసం ఈ యూనిట్ ను ప్రారంభించాం. ఈరోజు నుంచి పాలసీ అమలు అవుతోంది. ప్రైవేట్ లో మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రిలోని పరికరాలను వెంటనే గంటల్లో రిపేర్ చేయడం సాధ్యం అవుతుంది. ప్రభుత్వ దవాఖానలో కోట్ల విలువైన పరికరాలు ఉన్నాయి. AMC పాలసీ అమలు కోసం 17 కోట్లు కేటాయించాము. 8888526666 కాల్ సెంటర్ నంబర్ ఏర్పాటు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా విలువ ఉన్న పరికరాలు 1,020 ఉన్నాయి. EML, AML లిస్ట్ మందులు గతంలో 720 రకాలుఉండగా 843కు పెంచాం. మందుల కొనుగోలుకు సీఎం కేసీఆర్ గారు 500 కోట్లు కేటాయించారు. ఇందులో 100 కోట్లను సూపరింటెండెంట్ దగ్గర పెడుతున్నాం. మందుల నిర్వహణకు ఈ- ఔషధీ, పరికరాల నిర్వహణకు ఈ- ఉపకరణ్ అందుబాటులోకి తెచ్చాము.
కోవిడ్ కేసులు వస్తున్నాయి కాబట్టి అర్హులు అందరూ బూస్టర్ డోస్ వేసుకోండి. టీకాల పంపిణీలో కేంద్రం విఫలం అయింది. బూస్టర్ స్టాక్ పెంచాలని లేఖ రాస్తే కాస్త స్పందించింది. రాష్ట్రంలో C section రేటు తగ్గింది. 2021 ఆగస్ట్ లో 62 శాతం ఉంటే.. ఈ ఏడాది జూలై కి 56 శాతానికి తగ్గింది.కేసీఆర్ కిట్, ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. తెలంగాణ ఏర్పడ్డ నాడు 30శాతంగా ఉన్న ప్రసవాలు గణనీయంగా పెరిగి, ఇప్పుడు 66.8శాతానికి చేరాయి. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సి సెక్షన్ 47.24శాతం నుంచి 45.92శాతానికి తగ్గించాం. ప్రైవేటులో 80.98శాతం నుంచి 78.86శాతానికి తగ్గించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెంచడానికి MCH ఏర్పాటు, సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్ గారు 400 కోట్లు ఖర్చు చేశారు. బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్ కిట్, డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్. మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ ఇవ్వబోతున్నం.
అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ లలో ఈ కిట్ ఇస్తున్నాం. 1.50 లక్షల మంది గర్భిణులకు లబ్ధి. ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్ శాతం పెంచడం దీని లక్ష్యం. ఒక్కో కిట్ విలువ దాదాపు రూ.2000 ఉంటుంది. రెండు సార్లు ఇవ్వడం జరుగుతుంది. కిట్‌లో ఉండేవి. న్యూట్రీషన్ మిక్స్ పౌడర్ కిలో- 2 బాటిల్స్, ఒక కిలో ఖర్జూర, ఐరన్ సిరప్ 3 బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి. 13.30 లక్షల కెసిఆర్ కిట్స్ లబ్ధిదారులు ఉన్నారు . వారికి 1200 కోట్ల డబ్బు అందించాం. నిన్న TRR మెడికల్ కాలేజి విద్యార్థులను రీ అలోకేట్ చేయమని కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చాయి.మెరిట్ ఆధారంగా మంగళవారం లోగా సర్దుబాటు చేస్తాం. మిగితా రెండు కాలేజి లకు సర్దుబాటు ఉత్తర్వులు రాగానే వారికి కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తాం.