end
=
Saturday, November 23, 2024
వార్తలురాష్ట్రీయంమంచి కార్యక్రమాలు చేపడుతుంటే వారికేందుకో టెన్షన్..
- Advertisment -

మంచి కార్యక్రమాలు చేపడుతుంటే వారికేందుకో టెన్షన్..

- Advertisment -
- Advertisment -

Minister Harishrao | వనపర్తి : సీఎం కేసీఆర్‌ విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టిపెట్టారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్‌లో 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యరు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి మంగళవారం మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావుకు దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో కొత్తకోటలో తెరాస నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాలో వైద్య కళశాలలు రానున్నాయని తెలిపారు.

దీంతో ఇక్కడ ప్రజలకు అందుబాటులో వైద్యం ఉంటుందని హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఎమ్మెల్యే కోరిక మేరకు రెండు పిహెచ్‌సీ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇదే కాకుండా డయాలాసిస్‌ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. మన ఊరు మన బడీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిచారన్నారు. ఈ కార్యక్రమంతో వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ బడిలో ఇంగ్లీష్‌ మీడియం అమలులోకి రానుంది. రాష్ర్టంలో మంచి కార్యక్రమాలు చేపడుతుంటే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకలు ఆగమగం ఆయుతున్నారు. వాళ్లందుకే ఆగమైతున్నారో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. మంచి కార్యక్రమాలు చేపడుతుంటే హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి దానిపై కూడా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు.

కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ గుండ్రాతి వామన్ గౌడ్ ,  మున్సిపల్ చైర్మన్ సుకేశిని విశ్వేశ్వర్ , మార్కెట్ చైర్మన్ బాల నారాయణ , సిడిసి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు డాక్టర్ పిజే. బాబు,  మాజీ మార్కెట్ చైర్మన్ బీమ్ రెడ్డి,  జిల్లా అధికార ప్రతినిధి గాడిలా ప్రశాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ బీసం జయమ్మ,  కౌన్సిలర్లు,  కో ఆప్షన్ సభ్యులు,  మార్కెట్ డైరెక్టర్లు, కురుమూర్తి దేవస్థానం పాలక మండలి సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్లు,  నాయకులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -